సరిలేరు నీకెవ్వరు సెకండ్ డే కలెక్షన్స్

సరిలేరు నీకెవ్వరు సెకండ్ డే కలెక్షన్స్
x
Highlights

భరత్ అను నేను,మహర్షి చిత్రాల ద్వారా అగ్ర కథానాయకుడు మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’...

భరత్ అను నేను,మహర్షి చిత్రాల ద్వారా అగ్ర కథానాయకుడు మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'... అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు నిర్మించాడు. విడుదలైన ట్రైలర్స్, సాంగ్స్ కి మంచి స్పందన రావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

అంచనాలకి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. 'భరత్ అనే నేను', 'మహర్షి' తర్వాత మహే‌ష్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు. పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి ఫస్ట్ షోనుంచే మంచి టాక్ వచ్చింది. మహేష్ ఫ్యాన్స్ తో పాటు అభిమానులు కూడా సినిమాకి బ్రహ్మారధం పట్టారు. మొదటిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.47 కోట్లు రాబట్టింది.

ఇక మొదటిరోజు కలెక్షన్స్ ని బీట్ చేస్తూ సాగింది ఈ సినిమా.. . రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 63 నుంచి 65 కోట్ల వరకు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుల చెబుతున్నారు. ఇక మూడో రోజునే సినిమా వంద కోట్లు దాటేలా ఉందని అంటున్నారు. .. మహేష్ కెరియర్ లో హయ్యస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు నెలకొల్పింది ఈ సినిమా.. అంతకుముందు మహేష్ 'మహర్షి' చిత్రం తొలిరోజు రూ. 24.68 కోట్లును కొల్లగొట్టింది.

ఇక తెలుగులో ఓవరాల్‌గా చూసుకుంటే తొలిరోజు కలెక్షన్ల రికార్డులో 'సరిలేరు నీకెవ్వరు' నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి మూడుస్థానలలో 'బాహుబలి 2' (రూ. 43 కోట్లు), 'సాహో' (రూ. 36.63 కోట్లు), 'సైరా' (రూ. 36.37 కోట్లు) సినిమాలు ఉన్నాయి.

ఈ సినిమాలో మహేష్ ఆర్మీ రోల్ లో కనిపించాడు. విజయశాంతి ఈ సినిమాతో 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. సంగీత, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, రఘుబాబు ముఖ్యపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories