జనవరి 5 న ప్రీ రీలిజ్ ఈవెంట్..?

జనవరి 5 న ప్రీ రీలిజ్ ఈవెంట్..?
x
మహేష్ బాబు
Highlights

సంక్రాంతి సినిమాగా బరిలోకి దిగబోతుంది మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా.

సంక్రాంతి సినిమాగా బరిలోకి దిగబోతుంది మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ ఆర్మీ అజయ్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన మహేశ్ లుక్, సినిమా పోస్టర్స్, టిజర్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.. మహేశ్ గత సినిమా రికార్డులును బద్దలు కొట్టేలా ఈ సినిమా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో జనవరి 5 న నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుకకి టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేష్ ముఖ్య అతిధిగా విచ్చేస్తునట్టు సమాచారం.. గతంలో మహేష్ చాలా సినిమాల ఈవెంట్స్ కి వెంకటేష్ హాజరయ్యారు. గతంలో వీరిద్దరూ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాని చేశారు. ఇక దర్శకుడు అనిల్ కూడా గతంలో వెంకటేష్ తో f2 అనే సినిమాని చేశారు..

రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని అనిల్ సుంకర, దిల్ రాజ్ లతో కలిసి మహేశ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో అలనాటి తార విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories