నవ్వులే నవ్వులు : సరిలేరు నీకెవ్వరు మేకింగ్ వీడియో వచ్చేసింది

నవ్వులే నవ్వులు : సరిలేరు నీకెవ్వరు మేకింగ్ వీడియో వచ్చేసింది
x
Mahesh babu
Highlights

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' .. అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతి పండగకి కానుకగా...

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' .. అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతి పండగకి కానుకగా జనవరి 11 న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ లుక్ లో కనిపించనున్నాడు. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ సినిమాపైన మంచి అంచనాలను పెంచేసాయి.

విడుదల తేది దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరును పెంచేసింది. పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా గడిపేస్తుంది. అయితే తాజాగా సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోను కూడా బయటకు వదిలింది. వదిలిన మేకింగ్ వీడియోలో చిత్ర సెట్స్‌తో పాటుగా సినిమాలోని కొన్ని సన్నివేశాల మేకింగ్‌ను చూపించారు. కొండారెడ్డి బురుజు, ట్రైన్ సీన్స్ లాంటివి ఈ వీడియోలో చూపించారు. ముఖ్యంగా ఇవే చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి.

ఇక సినిమాని చేస్తున్న సమయంలో అక్కడ అంత చిత్ర బృందమంతా నవ్వుతూనే కనిపించింది. దీనితో రేపు ప్రేక్షకులను కూడా అలాగే నవ్వించనున్నారన్న విషయం స్పష్టం అవుతుంది. ఇక ఈ సినిమా ద్వారా అలనాటి తార విజయశాంతి రీఎంట్రీ ఇస్తుంది. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ ,రావు రమేష్, సంగీత, బండ్ల గణేష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాని దిల్ రాజు , అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు ఈ సినిమాని నిర్మించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భరత్ అను నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత మహేష్ బాబు నుంచివస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో రజినీకాంత్ దర్బార్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు , కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఇందులో ఏది సంక్రాంతి సినిమా అనిపించుకుంటుందో చూడాలి మరి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories