సరిలేరు నీకెవ్వరుకి మహేష్ బాబు లాభం ఎంత?

సరిలేరు నీకెవ్వరుకి మహేష్ బాబు లాభం ఎంత?
x
మహేష్ బాబు
Highlights

స్టార్ హీరోల పారితోషికం అన్నది ఒక్కప్పటి మాట.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది! సినిమాలకి పారితోషికాలు లేవు.

స్టార్ హీరోల పారితోషికం అన్నది ఒక్కప్పటి మాట.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది! సినిమాలకి పారితోషికాలు లేవు.. సినిమాల్లో వచ్చే లాభాలే.. మహేష్ బాబు నుంచి నాని వరకు అంత ఇదే ఫాలో అవుతున్నారు. తాజాగా సంక్రాంతికి రిలీజ్ అయిన భారీ సినిమాలలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా ఒకటి.. ఈ సినిమాకి మహేష్ హీరో మాత్రమే కాదు.. నిర్మాతల్లో ఒకడు కూడా..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు సినిమాని నిర్మించారు. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకొని ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 300 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు తెలిసింది. అయితే ఈ సినిమాకి గాను మ‌హేష్ బాబు ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. వ‌చ్చిన లాభాల్లో వాటాని మాత్రమే తీసుకున్నారని సమాచారం... దీనితో మహేష్ కి ఈ సినిమా 82 కోట్లు మిగిలిన‌ట్టుగా తెలుస్తోంది.

సినిమా సినిమాకి 20 కోట్లకి పైగా తీసుకునే మహేష్ ఈ సినిమాకి ఇంత లాభం పొందడంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మొదటిసారి ఆర్మీలుక్ లో కనిపించి మెప్పించారు. మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. విజయశాంతి కీలకపాత్రలో కనిపించారు.

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా పట్టాలేక్కనుంది. గతంలో వీరి కాంబినేషన్లో మహర్షి అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్ళీ ఇదే కాంబినేషన్ రీపిట్ అవుతూ ఉండడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories