Mahesh Babu: మహేష్ 'మురారి' కి పదిహేడేళ్ళు

Mahesh Babu: మహేష్ మురారి కి పదిహేడేళ్ళు
x
Highlights

యువరాజు, వంశీ లాంటి ప్లాపుల తరవాత మహేష్ బాబుతో మురారి అనే సినిమాని తెరకెక్కించారు కృష్ణవంశీ.

యువరాజు, వంశీ లాంటి ప్లాపుల తరవాత మహేష్ బాబుతో మురారి అనే సినిమాని తెరకెక్కించారు కృష్ణవంశీ. 2001 ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా మహేష్ కెరీర్ కి మెయిన్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.. నేటికి ఈ సినిమా విడుదలై 19 సంవత్సరాలు పూర్తైంది.. ఈ సినిమా గురుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. మొదటగా కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబుని వెండితెరకి పరిచయం చేయాలనీ అనుకున్నారు హీరో కృష్ణ. కానీ మొదటి సినిమా అయితే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి కాబట్టి మొదటి సినిమా చేయనని కృష్ణవంశీ చెప్పడంతో అది కాస్తా రాఘవేంద్రరావుకి వెళ్ళింది.

2. మహేష్ బాబుతో ఎలాంటి కథని చేయాలనీ అనుకున్న నేపధ్యంలో తన ఫ్రెండ్స్ తో జాలిగా డిస్కషన్స్ సాగుతుండగా ఫిరోజ్ గాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ ఎందుకు ఇలా అకస్మాత్తుగా చనిపోతున్నారన్న ప్రశ్న వచ్చింది. దీనికి తన ఫ్రెండ్స్ లిస్టు లో ఒకతను శాపం అన్నాడు. దీనితో వెంటనే కృష్ణవంశీకి ఓ ఐడియా వచ్చింది. ఆ శాపం విలన్ వల్ల కాకుండా ఒక ఫోర్స్‌ వల్ల జరగాలని దానికి ఆధ్యాత్మికం జతపరిచాడు. ఇక ఎప్పటినుంచో మహేష్ బాబుని బృందావనంలో కృష్ణుడులాగా చూడాలి అనుకున్నాడు. అంతే ఈ మూడు మిక్స్ చేసి అద్భుతమైన కథని సిద్దం చేసాడు. కృష్ణ, మహేష్ అంతా సూపర్ అన్నారు.

3. ఈ సినిమాకి ముందు కృష్ణా ముకుందా మురారి అని అనుకున్నారు. ఆ తారావత మురారి అని చిన్నగా పెట్టారు.

4. ఈ సినిమాకి ముందు హీరోయిన్ గా వేరే అమ్మాయిని అనుకున్నారు. కానీ ఓ పెళ్ళికి వచ్చిన సోనాలి బింద్రేకు కథ చెప్పారు. నచ్చడంతో డేట్స్ ఇచ్చారు.

5. 65 సంవత్సరాల వయసులో జిక్కీ గారితో మణిశర్మ పాడించిన అలనాటి రామచంద్రుడు సాంగ్ ఒక సెన్సేషన్. ఈ పాటని క్లైమాక్స్ కి ముందు షూట్ చేస్తానని కృష్ణవంశీ అంటే అందరు అడ్డు చెప్పారు. కానీ అందరిని ఒప్పించి అదే పాటను తెరకెక్కించారు కృష్ణవంశీ .. ఇప్పటికి ఈ పాట ఎవర్ గ్రీన్.. ప్రతి పెళ్లిలో ఈ పాట ఉండాల్సిందే..

6. 104 డిగ్రీల జ్వరంలో మహేష్ గోదావరి ఒడ్డున "డుం డుం డుం నటరాజు ఆడాలి" పాట, వాటర్ ఫైట్ చేశాడు.

7.ఎక్కువగా సీతారామశాస్త్రితో పాటలు రాయించుకునే కృష్ణవంశీ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను వేటూరితో రాయించుకున్నారు.

8. ముందుగా బామ్మ పాత్రకు మరీ షావుకారు జానకిని అనుకున్నారు కానీ 40 రోజుల డేట్స్ అంటే కష్టం అనడంతో ఫైనల్ గా సుకుమారిని తీసుకున్నారు.

9. సినిమా అంతా రామచంద్రపురం కోటలోనే తీశారు.. ముందు పార్ట్ అంతా మహేష్ ఇల్లుగాను, వెనుక పార్ట్ అంతా సోనాలీ ఇల్లుగాను చూపించారు..

10. ఐదు నెలల షూటింగ్. రోజుకి 12 గంటలు కష్టపడ్డారు. ఫైనల్ గా మూవీని చూసిన హీరో కృష్ణ భాగోద్వేగానికి గురయ్యారు. ఇక ఫ్యాన్స్ కూడా కృష్ణ కొడుకుగా కాకుండా మహేష్ నటనని చూసారు.

11. ఈ సినిమాకు అసిస్టెంట్స్ గా పనిచేసిన శోభన్, నందినీ రెడ్డి, శ్రీవాస్, కుమార్ నాగేంద్రలు ఆ తరవాత దర్శకులుగా మారారు.

12. తమిళంలో ఈ సినిమాను ఇదే టైటిల్ తో కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ కలిసి డబ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories