సుదర్శన్ 35MM థియేటర్ వద్ద మహేష్ భారీ కటౌట్

mahesh babu 81 Ft cutout
x
mahesh babu 81 Ft cutout
Highlights

సుదర్శన్ 35MM ధియేటర్ వద్ద మహేష్ భారీ కటౌట్ ని ఉంచారు అభిమానులు.. మొత్తం ఈ కటౌట్ 81 ఫీట్ల ఎత్తుతో ఉండి

మహేష్ బాబు ఇప్పుడు ఫుల్ సక్సెస్ లో ఉన్నాడు. చేసిన ప్రతి సినిమా హిట్టు అవుతూ రికార్డులను తిరగరాస్తుంది. తాజాగా మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి పండగకి జనవరి 11 న విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన సినిమా టిజర్ కి ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన వస్తుంది. సౌత్‌లో తొలి 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా ఆల్‌టైం రికార్డ్‌ నమోదు చేసింది ఈ టీజర్.

ఇక హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ లో ఉన్న సుదర్శన్ 35MM ధియేటర్ వద్ద మహేష్ భారీ కటౌట్ ని ఉంచారు అభిమానులు.. మొత్తం ఈ కటౌట్ 81 ఫీట్ల ఎత్తుతో ఉండి అందరిని అబ్బురపరుస్తుంది. ప్రస్తుతం ఈ కటౌట్ ట్రేండింగ్ మారింది. మహేష్ బాబుకి ఈ థియేటర్ సెంటిమెంట్ అని చెప్పాలి. ఈ విషయాన్ని ఆయనే మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు కూడా.. మహేష్ చాలా సినిమాలు ఈ థియేటర్లో రికార్డులను సృష్టించాయి.

ఇక సరిలేరు నీకెవ్వరు విషయానికి వస్తే ఇందులో మహేష్ కి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుంది. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలలో కనిపిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories