మరో కొత్త వ్యాపారంలోకి మహేశ్‌ బాబు?

మరో కొత్త వ్యాపారంలోకి మహేశ్‌ బాబు?
x
Highlights

సినీ తారలు ఓ వైపు సినిమాలలో బిజీబిజీ గడుపుతూనే తమ సొంత వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇటివలే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏఎంబీ సినిమాస్ పేరుతో...

సినీ తారలు ఓ వైపు సినిమాలలో బిజీబిజీ గడుపుతూనే తమ సొంత వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇటివలే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు అదే దూకుడుతో మరో వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సొంత దుస్తుల బిజినెస్ లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. మిమ్మల్ని ఉత్సుకతకు గురి చేసే విషయాన్ని పంచుకుంటున్నాం. ప్రస్తుతం మేం దీని పనిలోనే ఉన్నాం. సీక్రెట్‌ను బయటపెట్టేందుకు ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి' అంటూ http://www.spoyl.in/mahesh-babu అనే వెబ్‌సైట్‌ను మహేశ్‌ బృందం పోస్ట్‌ చేసింది. అయితే దిన్ని తిరిగి హీరో మహేష్ బాబు షేర్ చేశారు.

ఈ పేజ్‌లో కింది భాగంలో దుస్తుల రకాలు, బ్రాండ్‌లు ఉంచారు. దీన్ని బట్టి మరో మూడు రోజుల్లో ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎలాంటివి విక్రయానికి ఉంచుతారో చూడాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి. తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ 'రౌడీ' పేరుతో సొంత దుస్తుల బ్రాండ్ ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories