వ్యవసాయ మహర్షులతో.. మహా రిషి!

వ్యవసాయ మహర్షులతో.. మహా రిషి!
x
Highlights

విదేశాల్లో ఉన్నతమైన కెరీర్ ను వదిలేసి సిద్దిపేటలో ఆహారమే యోగా అనే ఆర్గానిక్ స్టోర్ నడుపుతున్న వారొకరు.. ఎమ్మేఇంగ్లీష్ చేసి.. పెద్ద సాఫ్ట్ వేర్...

విదేశాల్లో ఉన్నతమైన కెరీర్ ను వదిలేసి సిద్దిపేటలో ఆహారమే యోగా అనే ఆర్గానిక్ స్టోర్ నడుపుతున్న వారొకరు.. ఎమ్మేఇంగ్లీష్ చేసి.. పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో నెట్ వర్క్ ఇంజనీరుగా పనిచేసి.. దానిని పక్కన పెట్టి తెనాలి లో లూనార్ వ్యవసాయం మొదలుపెట్టింది మరొకరు.. హైదరాబాద్ లో కంప్యూటర్ సంస్థలో మంచి ఉద్యోగాన్ని వదిలి పెట్టి 2016 నుంచి గుంటూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశీయ విత్తనాలను అభివృద్ధి చేస్తున్న యువకుడొకరు.. వ్యవసాయాన్ని నమ్ముకుని.. అప్పుల పాలైనా.. నెల తల్లి మీద మమకారం తో ఊరు వదిలి పోకుండా వ్యవసాయం చేస్తూ బ్రతుకుతున్న రైతు కుటుంబం ఒకటి.. ఇలా ఎందరో వ్యవసాయ తపస్సు చేస్తున్న మహర్షులతో మహా రుషి మహేష్ బాబు సమావేశం అయ్యారు.

మహర్షి సినిమాతో వ్యవసాయం పై విప్లవాత్మక ప్రసంగాన్ని వినిపించిన మహేష్ ఇపుడు ఆ దారిలో నడుస్తున్న నిజమైన మహర్షులను కలిసి మాట్లాడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది సినిమా ప్రమోషన్ కోసమే అయినా.. వ్యవసాయం పై మక్కువ పోతున్న మన సమాజంలో మిగిలి వున్న మహర్షుల కథలు ప్రపంచానికి తెలియడం ద్వారా రైతు దేశానికి చేస్తున్న సేవలకు సత్కారాన్ని చేస్తున్నారు మహర్షి సినిమా టీం.

హైదరాబాద్ లో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ పంట చేతికి రాక తన బంధువులు ఆత్మహత్య చేసుకోవడం గురించి వివరించారు. ఆమె మాటలు విన్న మహేశ్‌.. 'మీరు మాకెంతో స్ఫూ్ర్తిదాయకం. నేను ఇప్పటివరకు కలిసిన గొప్ప వ్యక్తుల్లో మీరొకరు. హ్యాట్సాఫ్‌ టు యూ. మీరున్నారు కాబట్టే మేమున్నాం' అన్నారు. మొత్తమ్మీద ఈ కార్యక్రమం ప్రపంచానికి రైతు అనే పదం లోని మరో కోణాన్ని చూపిస్తుందనడం లో సందేహం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories