9 ఫాలో అవుతున్న మహేష్ ... కానీ అక్కడ మిస్ చేసాడుగా..

9 ఫాలో అవుతున్న మహేష్ ... కానీ అక్కడ మిస్ చేసాడుగా..
x
Highlights

తెలుగు వాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ అని ఓ కవి అన్నాడు. అవును వాస్తవమే మరి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కి కోదవే లేదు.. ఇందులో ఒక్కొకరిది...

తెలుగు వాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ అని ఓ కవి అన్నాడు. అవును వాస్తవమే మరి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కి కోదవే లేదు.. ఇందులో ఒక్కొకరిది ఒక్కో స్టయిల్.. హీరో గోపిచంద్ కి సినిమా టైటిల్ లో సున్నా ఉంటే బాగుంటుందని ఓ సెంటిమెంట్, మహేష్ బాబు కొత్త సినిమా ముహూర్తానికి రాకుంటే హిట్టు అవుతుందని ఓ సెంటిమేట్, సినిమా స్టార్ట్ చేసేముందు తిరుమలకు వెళ్లి స్క్రిప్ట్ కి పూజలు చేయించడం దిల్ రాజు కి ఓ సెంటిమెంట్ ... ఇలా ఎవరి సెంటిమెంట్స్ వారికి ఉన్నాయి .

అయితే సరిలేరు నికెవ్వరు సినిమాకి గాను మహేష్ మొత్తం 9 ని ఫాలో అవుతున్నాడని టాక్ నడుస్తుంది.. 09:09 కి మహేష్ ఇంట్రో పోస్టర్ రిలీజ్ అంటూ ఓ పోస్టర్ ని విడుదల చేసారు. ఈరోజు విజయశాంతి ఫస్ట్ లుక్ ని 09:09 కి రిలీజ్ చేశారు. ఇక ఇదే రోజు సాయంత్రం 05:04కి మహేష్ బాబు కొత్త లుక్ ని రిలీజ్ చేసారు. అక్కడ కూడా కలిపితే తొమ్మిదే వస్తుంది.

కానీ ఈ సినిమా విడుదల తేదీ(12.01.2020) ని కలిపితే మాత్రం తొమ్మది రావడం లేదు. మరి ఇది దర్శకుడి సెంటినెంటా? లేకా నిర్మాతల సెంటిమేటా అన్నది తెలియాల్సి ఉంది. ఇందులో మహేష్ కి జోడిగా రష్మీక మందన్నా నటిస్తుంది. అలనాటి తార విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories