రష్మిక పై మహేష్ బాబు ఫాన్స్ గరంగరం...

రష్మిక పై మహేష్ బాబు ఫాన్స్ గరంగరం...
x
Highlights

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది....

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇదే సినిమాతో అలనాటి తార విజయశాంతి రీఎంట్రీ ఇస్తుంది. దీనితో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తాజాగా విజయదశమి సందర్భంగా సినిమాని సంబంధించిన ఓ పోస్టర్ ని దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా సినిమాలోని ప్రముఖులకు ట్యాగ్ చేస్తూ విడుదల చేసారు.

ఇందులో మహేష్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన కర్నూల్ కొండారెడ్డి బురుజు సెట్ దగ్గర కత్తి పట్టుకొని ఉన్నాడు. ఈ ట్వీట్ ని రీట్వీట్ చేసిన రష్మిక 'హ్యాపీ దసరా' అంటూ రెండు ఎమోజీకు పెట్టి ఊరుకుంది. రష్మిక ట్యాగ్స్ ఇవ్వకపోవడంతో మహేష్ ఫాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. కనీసం ట్యాగ్ కూడా చేయడం రాదా అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండగా దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories