ప్రతి అమ్మాయి కలలుగనే ప్రపంచాన్ని అందించావ్‌: నమ్రత

ప్రతి అమ్మాయి కలలుగనే ప్రపంచాన్ని అందించావ్‌: నమ్రత
x
Highlights

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపూల్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్ ఒకరు.

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపూల్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్ ఒకరు.. వంశీ సినిమాలో కలిసి నటించి వీరు 2005 ఫిబ్రవరిలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేటితో వీరి పెళ్ళికి 15 ఏళ్ళు నిండాయి. ఈ నేపధ్యంలో నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది!

"ప్రతి అమ్మాయి కలలుగనే ఓ అద్భుతమైన ప్రపంచాన్ని నాకందించావ్‌. నా జీవితమంతా నీ స్వచ్ఛమైన ప్రేమతో, ముద్దులొలికే మన ఇద్దరు పిల్లలతో నింపేశావ్‌. మీ ప్రేమానురాగాలతో మన ఇల్లు ఎప్పుడూ నందనవనమే. మీ సాహచర్యం నాకెప్పుడూ ఉంటేచాలు. ఇంతకన్నా ఏం కావాలి నాకు. నా ప్రియమైన మహేశ్‌కు 15వ పెళ్లిరోజు శుభాకాంక్షలు" అంటూ పోస్ట్ చేసింది.

నమ్రతతో పెళ్లి తర్వాత మహేష్ కేరీయర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మహేష్ డ్రెస్సింగ్ స్టైల్ , డేట్స్, యాడ్స్ ఇలా అన్ని నమ్రతనే చూసుకుంటుంది. ఒక మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని చెప్పడానికి నమ్రత చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.. వీరికి ఇద్దరి పిల్లలు ఉన్నారు. బాబు గౌతం కృష్ణ కాగా పాప సితార..

తాజాగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. మహేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. తన తదుపరి చిత్రాన్ని మహేష్ వంశీ పైడిపల్లితో చేయనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories