RRRలో మహేష్, అమితాబ్?

RRRలో మహేష్, అమితాబ్?
x
Highlights

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమా జాబితాలో చేరనున్నారట ! కానీ ఈ సినిమాలో తెరపైన వీరు కనిపించరు.. వినిపిస్తారు అంతే!. ఈ సినిమాని మొత్తం పది భాషల్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే హిందీ, తెలుగు వర్షన్ లకి గాను అమితాబ్, మహేష్ బాబుల చేత రాజమౌళి వాయిస్ ఓవర్ చెప్పించనున్నారట! ఇక మిగతా వర్షన్ లలో ఆ భాషలలోని స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.ఇక మహేష్ ఇప్పటికే జల్సా, బాద్షా చిత్రాలకి వాయిస్ ఓవర్ అందించాడు.

దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని జూలై 30న భారీ అంచనాల నడుమ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని జులై 30 న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories