మహర్షి సక్సెస్ టూర్

మహర్షి సక్సెస్ టూర్
x
Highlights

మహర్షి మహేష్ బాబును ఆనందం లో ముంచెత్తుతోంది. కాన్సెప్ట్ ఎంతో నచ్చి సినిమా చేశాడు మహేష్. అన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమాని మంచి సినిమాగా మలిచేందుకు...

మహర్షి మహేష్ బాబును ఆనందం లో ముంచెత్తుతోంది. కాన్సెప్ట్ ఎంతో నచ్చి సినిమా చేశాడు మహేష్. అన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమాని మంచి సినిమాగా మలిచేందుకు కష్టపడ్డాడు. కష్టానికి మంచి విజయాన్ని దక్కించుకుని దూసుకుపోతున్నాడు మహర్షి. సాధారణంగా మహేష్ సినిమా విడుదలైన వెంటనే కుటుంబంతో గడపటానికి విదేశీ టూర్ కు వెళ్ళిపోతాడు. అయితే, ఈ విజయం ఇచ్చిన కిక్ తో ఈసారి టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడట. సినిమాని నాన్ బాహుబలి రికార్డులన్నీ తుడిచిపెట్టే స్థాయికి తీసుకు వెళ్లాలని డిసైడ్ అయ్యాడట. అందుకే.. సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. రైతులతోనూ , విద్యార్థులతోనూ ఇంటరాక్ట్ అయ్యే విధంగా టూర్ ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారని చెబుతున్నారు. మహేష్ బాబు ఒక సినిమా ప్రమోషన్ కోసం వెళ్లడం చాలా తక్కువ. ఇపుడు ఇలా వెళుతున్నాడన్న వార్త తో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories