మహర్షి మొదటి వారం కలెక్షన్లు

మహర్షి మొదటి వారం కలెక్షన్లు
x
Highlights

మహర్షి సినిమా సంచలనం గా మారింది. ముగ్గురు అగ్ర నిర్మాతలు కలసి నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందునుంచే భారీ అంచనాలను నెలకొల్పింది. మహేష్ బాబు 25 వ...

మహర్షి సినిమా సంచలనం గా మారింది. ముగ్గురు అగ్ర నిర్మాతలు కలసి నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందునుంచే భారీ అంచనాలను నెలకొల్పింది. మహేష్ బాబు 25 వ సినిమా కావడంతో అభిమానుల్లో మహర్షి పై ఎంతో నమ్మకం ఏర్పడింది. వంశీ పైడిపల్లి దర్శకుడు కావడం.. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తుండడంతో సినిమా పై అంచనాలు విడుదల సమయానికి ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఎక్కడ చూసినా మహర్షి మేనియా కనిపించింది. సామాజిక అంశాలే ప్రధానంగా.. వినోదాన్ని, భావోద్వేగాల్నీ మిళితం చేసి రైతు సమస్యలపై చర్చించడం తో సినిమా అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటోంది.

ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటివారంలో ఈ సినిమా 59.37 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తొలివారంలో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 21.67 కోట్ల షేర్ ను సాధించడం విశేషం. ఇక గ్రాస్ కలెక్షన్ల పరంగా భారత్ అనే నేను మొదటి వారం కలెక్షన్లను మహర్షి దాటేశాడు. భారత్ అనే నేను సినిమా 232.68 కోట్లు వసూలు చేయగా, మహర్షి 233 కోట్లను మొదటి వారం లో ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. మహేశ్ బాబు కెరియర్లోనే ఇవి అత్యధిక వసూళ్లని చెబుతున్నారు. మహేశ్ బాబు అభిమానులు కోరుకున్నట్టుగానే ఆయనకి భారీ విజయం దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories