మా ఎన్నికల్లో నరేశ్‌ ప్యానల్‌ విజయం.. గెలిచిన వారు వీరే..

మా ఎన్నికల్లో నరేశ్‌ ప్యానల్‌ విజయం.. గెలిచిన వారు వీరే..
x
Highlights

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ విజయం సాధించింది. దీంతో మా అధ్యక్షుడిగా నరేశ్‌, ఎగ్జిక్యూటివ్...

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ విజయం సాధించింది. దీంతో మా అధ్యక్షుడిగా నరేశ్‌, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్‌, జాయింట్‌ సెక్రటరీ గౌతమ్‌ రాజు, శివ బాలాజీ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల గెలుపొందారు. ఇక్కడ విశేషం ఏమంటే హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

మాలో మొత్తం 745 ఓట్లు ఉండగా, 472 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మా ఎన్నికల్లో నరేశ్, శివాజీ రాజా ప్యానళ్ల మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. బ్యాలెట్ పద్దతిలోనే ఈసారి ఈసారి ఎన్నికలు జరిగాయి. తెల్లవారుజామున మా ఫలితాలు వెల్లడించారు రిటర్నింగ్ అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories