RRR: ఆర్ ఆర్ ఆర్ కి షూటింగ్ సమస్యలు

RRR: ఆర్ ఆర్ ఆర్ కి షూటింగ్ సమస్యలు
x
Highlights

రాజమౌళి సినిమా అంటేనే భారీ స్థాయిలో వుంటుంది, అలాంటిది జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ కి ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం...

రాజమౌళి సినిమా అంటేనే భారీ స్థాయిలో వుంటుంది, అలాంటిది జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ కి ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు. కరోన ఎఫెక్ట్ లేక పోతే మొత్తం సినిమా కంప్లీట్ అయ్యేది కానీ లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ ఆగిపోవటంతో ఆర్ ఆర్ ఆర్ యూనిట్ కి టెన్షన్ స్టార్ట్ అయింది. అసలు సినిమా షూటింగ్ ఎప్పడు స్టార్ట్ చేస్తారో తెలియని పరిస్థితి అంతే కాదు కేంద్ర ప్రభుత్వం గైడ్ లెన్స్ ప్రకారం అయితే ఆర్ ఆర్ ఆర్ కి సమస్యలు తప్పవు.

లాక్ డౌన్ సడలింపులో భాగంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమ సినిమా షూటింగ్స్ చేసుకోవడానికి అనేక గైడ్ లెన్స్ తో పర్మిషన్స్ ఇచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లెన్స్ తో అయితే అసలు సినిమా షూటింగ్ చెయ్యలేని పరిస్థితి ఇప్పడు కేంద్ర ప్రభుత్వం మరి కొన్ని నిబంధలు విధించబోతుంది పబ్లిక్ మధ్య అసలే సినిమా షూటింగ్స్ చెయ్య రాదనీ పెళ్ళి సీన్లు, ఫంక్షన్స్, యుధ్దాలు, ఇలా క్రౌడ్ ఎక్కువగా వుండే సన్నివేశాలకు పర్మిషన్స్ ఇచ్చేది లేదనీ తేల్చి చెప్పింది.

ఈ నిబంధనలే పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఆర్ ఆర్ ఆర్ కు పెద్ద సమస్యగా మారాయి. ట్రిపుల్ ఆర్ మూవీ షూటింగ్ ఇంకా 30 శాతం మిగిలే ఉంది. ఆలియ భట్, ఓలివియా లతో చేయాల్సిన సీన్స్ వున్నాయి కానీ ఇప్పడు ఆ ఇద్దరు వచ్చే పరిస్థితి లేదు అంతే కాదు ఇప్పటికే వేసిన సెట్స్ చాలా వరకు దెబ్బతిన్నాయి. మరో వైపు నిర్మాత డి.వి.వి దానయ్య కు ఇటీవలే హార్ట్ సర్జరీ అవ్వటంతో ఆయన రెస్ట్ లో వున్నారు. దీనికి తోడు ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఆర్ధిక సమస్యలు ఎక్కువగా వుండటంతో సినిమా ఫైనాన్షియర్స్ నుండి ఒత్తిడి ఎక్కువ అవుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories