సాహితీ వెలుగు..కళాసొబగు..గొల్లపూడి జీవిత చిత్తరువు!!

సాహితీ వెలుగు..కళాసొబగు..గొల్లపూడి జీవిత చిత్తరువు!!
x
గొల్లపూడి మారుతీరావు
Highlights

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. మరో దృవతార నేలరాలింది. కళారత్న గొల్లపూడి మారుతీరావు కాసేపటి క్రితం తుదిశ్వాసవిడిచారు. చెన్నైలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో...

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. మరో దృవతార నేలరాలింది. కళారత్న గొల్లపూడి మారుతీరావు కాసేపటి క్రితం తుదిశ్వాసవిడిచారు. చెన్నైలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 250కి పైగా చిత్రాల్లో గొల్లపూడి నటించారు. గొల్లపూడి మరణవార్తతో విషాద ఛాయలు నెలకొన్నాయి. నటీనటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. మంచి వ్యక్తిని కోల్పోయని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఒక రంగంలో రాణించడమే కష్టమైన ఈ రోజుల్లో ఎన్నో రంగాలలో పరిపూర్ణత సాధించిన బహు కళా ప్రపూర్ణుడు గొల్లపూడి మారుతీరావు. ఆయనో విలక్షణ నటుడు, హాస్యనటుడు, ప్రతి నాయకుడు, రచయిత, కవి, జర్నలిస్టు, ప్రసంగీకుడు. ఇలా పలు రంగాల్లో రాణించి విశాఖ నగరానికి కీర్తి తెచ్చారీ పెద్దాయన.

చిరంజీవి కథానాయకుడిగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రానికి మాటల రచయితగా కూడా పనిచేశారు. చిన్న వయసులోనే రాఘవ కళానికేతన్‌ పేరున నాటక బృందాన్ని నడిపారు గొల్లపూడి. ఆడది, కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, రిహార్సల్స్, వాపస్, మహానుభావాలు, నాటకాలకి నిర్మాణం, దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రధారిగా కూడా నటించారు. విద్యార్థి దశలో ఉండగానే స్నానాలగది, మనస్తత్వాలు నాటకంలోనూ అభినయించారు.

1963లో 'డాక్టర్‌ చక్రవర్తి' చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు గొల్లపూడి. ఆయనకి అదే మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథా రచయితగా నంది అవార్డుని అందుకున్నారు. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' తర్వాత నటుడిగా కూడా బిజీ అయిపోయారు. 250 చిత్రాలకిపైగా సహ నటుడిగా, హాస్య నటుడిగా మెరిశారు. 'సంసారం ఒక చదరంగం', 'స్వాతిముత్యం', 'తరంగిణి', 'త్రిశూలం', 'అసెంబ్లీ రౌడీ', 'ముద్దుల ప్రియుడు', 'ఆదిత్య 369' తదితర చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.

ప్రేక్షకులకు నటుడిగానే సుపరిచిమైనా గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత. సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మాటల రచయితగా సినీ రంగంపైనా వ్యాఖ్యాతగా బుల్లితెరరపైనా తనదైన ముద్రవేశారు. వక్తగా, కాలమిస్టుగా కూడా ఆయన ఎంతో పేరు సంపాదించారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.

తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావులకి ఐదో అబ్బాయిగా మారుతీరావు జన్మించారు. విశాఖపట్నంలోని సీబీఎం ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్‌.కళాశాలతోపాటు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. బీఎస్సీ పూర్తి చేసిన ఆయన 1959లో ఆంధ్రప్రభ ఉప సంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత రేడియోలో ట్రాన్స్‌మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికయ్యారు. హైదరాబాదు, విజయవాడల్లో పనిచేశారు. ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొందారు. సంబల్‌పూర్, చెన్నై, కడప కేంద్రాల్లో పనిచేశారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన రెండు దశాబ్దాలు పనిచేశారు. అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేశారు.

సినీ రచయితగా నాలుగు నంది పురస్కారాలు సొంతం చేసుకున్న గొల్లపూడి మారుతీరావుకి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కళారత్నతో పాటు మరెన్నో విశిష్ట పురస్కారాలు లభించాయి. బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన గొల్లపూడి మారుతీరావు పలువురు ప్రముఖల్ని ఇంటర్య్వూ చేశారు. ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరి గోల వారిదే, ప్రేమలు పెళ్ళిళ్ళు, భార్యారూపవతీ శత్రు, ఏది నిజం తదితర ధారావాహికల్లో నటుడిగా కూడా మెప్పించారు.

ఆత్మ గౌరవం సినిమాకు కథ, మాటలు సమకూర్చి చలన చిత్ర సీమలో వెల్లువ సృష్టించారు . అద్భుతమైన జీవితాన్ని తన కథల్లో సంభాషణల్లో ఆవిష్కరించారు. ఇదంతా ఓ ఎత్తు. నటుడిగా ఆయన విశ్వరూపం మరో ఎత్తు. హాస్య సంభాషణలతో ఎంత ఆకట్టుకున్నా, క్రూరమైన హావభావాలతో గగుర్భాటు కలిగించినా, జీవితంలో డక్కీముక్కీలు తిన్న ఇంటి పెద్దగా ఆయన పోషించిన పాత్రలు అతని నటనా వైభవానికి సజీవసాక్ష్యాలు. సంసారం ఓ చదరంగం, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి, డాక్టర్‌ చక్రవర్తి, కళ్లు వంటి చిత్రాల్లో ఆయన నటనకు గుర్తింపు దక్కింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories