లయన్ కింగ్ ముందస్తు సంచలనం

లయన్ కింగ్ ముందస్తు సంచలనం
x
Highlights

డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మక యానిమేషన్ సినిమా లయన్ కింగ్. ఈ సినిమా ఇండియాలో వచ్చే వారంలో దాదాపు అన్ని ప్రధాన భాషల్లోనూ విడుదల కానుంది. అయితే, ఒక వారం...

డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మక యానిమేషన్ సినిమా లయన్ కింగ్. ఈ సినిమా ఇండియాలో వచ్చే వారంలో దాదాపు అన్ని ప్రధాన భాషల్లోనూ విడుదల కానుంది. అయితే, ఒక వారం ముందుగానే దీనిని చైనాలో విడుదల చేశారు. ముందస్తుగా అక్కడ విడుదలైన లయన్ కింగ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. డిస్నీ గత చిత్రాలైన 'జంగిల్‌బుక్‌'(11.6 మిలియన్‌ డాలర్లు), 'బ్యూటీ అండ్‌ ద బీస్ట్‌'(12.4 మిలియన్‌ డాలర్లు) చిత్రాల ఓపెనింగ్‌ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టింది. చైనాలో తొలి రోజే ఈ చిత్రం 14.5మిలియన్‌ డాలర్లు వసూలు చేసినట్లు హాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇక అమెరికాతో పాటు, భారత్‌లోనూ ఈనెల 19న 'ది లయన్‌ కింగ్‌' విడుదల కానుంది. ఇందులోని పాత్రలకు తెలుగులో నాని, రవిశంకర్‌, జగపతిబాబు, అలీ, బ్రహ్మానందం, లిప్సిక డబ్బింగ్‌ చెప్పారు. దీంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళంలో సిద్ధార్థ్‌, అరవిందస్వామిలు డబ్బింగ్‌ చెప్పగా, హిందీలో షారుఖ్‌ఖాన్‌, ఆయన తనయుడు ఆర్యన్‌, ఆశిష్‌ విద్యార్థి తదితరులు డబ్బింగ్‌ చెప్పారు. ఇలా ఆయా భాషల్లో పేరొందిన వారితో డబ్బింగ్ చెప్పించి డిస్నీ ఈ సినిమాకి ఇండియాలోనూ విపరీతమైన హైప్ తెచ్చింది. ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories