ప్రియమైన రానాతో జీవితం ప్రారంభం : మిహికా

యంగ్ హీరో రానా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన మిహీకా బజాజ్ తో గత కొద్దిరోజులుగా...
యంగ్ హీరో రానా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన మిహీకా బజాజ్ తో గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్న రానా ఇటివలే తన ప్రేయసి అంటూ సోషల్ మీడియాలో అందరికి తెలియజేశాడు. ఇదిలా ఉంటే తనకు కాబోయే భర్త రానాతో దిగిన రెండు ఫొటోలను ఇన్‌స్టా వేదికగా మొదటిసారి షేర్ చేశారు మిహీకా. 'నా ప్రియమైన రానాతో కలిసి జీవితం ప్రారంభం' అని క్యాప్షన్ ఇచ్చారు. రానాతో నవ్వులు పూయిస్తున్న మరో ఫొటోను షేర్ చేస్తూ.. 'మై హ్యాపీ ప్లేస్ @ రానా' అని తెలిపారు. ఇప్పటికే మిహీకాతో దిగిన ఫొటోలను రానా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక రానా సినిమాల విషయానికి వచ్చేసరికి గతఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో ఆకట్టుకున్న రానా, ప్రస్తుతం అరణ్య ,విరాటపర్వం సినిమాలలో నటిస్తున్నాడు. ఇందులో అరణ్య విడుదలకి సిద్దంగా ఉండగా, విరాటపర్వం షూటింగ్ చివరిదశలో ఉంది.
View this post on InstagramTo the beginning of forever 💕 @ranadaggubati
A post shared by miheeka (@miheeka) on
View this post on InstagramMy happy place! 🥰🥰 @ranadaggubati
A post shared by miheeka (@miheeka) on