'బిగ్ బీ ‌'కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

బిగ్ బీ ‌కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
x
అమితాబ్ బ‌చ్చన్‌
Highlights

బిగ్ బీ అని పిలుచుకునే ఇండియన్ సినిమా బిగ్ ఐకాన్ అమితాబ్ బ‌చ్చన్‌ ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.

బిగ్ బీ అని పిలుచుకునే ఇండియన్ సినిమా బిగ్ ఐకాన్ అమితాబ్ బ‌చ్చన్‌ ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. భారతీయ చలనచరిత్రకు మూలపురుషుడు అయిన దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో ఇచ్చే ఈ అవార్డు ఈ ఏడాది అమితాబ్ బచ్చన్‌ కైవసం చేసుకోనున్నారు. ఫాల్కే పేరుపైన అవార్డును అందించడాన్ని 1969లో మొదలు పెట్టారు. భార‌తీయ సినీరంగంలో ఇచ్చే అవార్డులలో దీన్నే అతిపెద్ద అవార్డుగా పరిగణలోకి తీసుకుంటారు. సోమవారం ఉదయం జరిగిన జాతీయ సినిమా అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రప‌తి వెంక‌య్యనాయుడు విజేత‌ల‌కు అవార్డుల‌ను అంద‌జేశారు.

ఇదిలా ఉంటే బిగ్ బీ ఆరోగ్యం సహకరించనందుకు ఆ‍యన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని తెలిపారు. దీంతో రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రప‌తిభ‌వ‌న్‌లో ఈనెల 29న అమితాబ్‌కు ఫాల్కే అవార్డు అంద‌జేయ‌నున్నారని స‌మాచార‌, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు. రెండు తరాలుగా ప్రక్షకుల్ని అలరించి ప్రక్షకుల మనసు దోచుకున్న అమితాబ్ బచ్చన్‌ని ఈ అవార్డును అందుకోవడానికి అర్హులుగా ఏకగ్రీవంగా ఎంపిక చేస్తున్నట్టు ఆ‍యన ప్రకటించారు. ఈ అవార్డును గెలుచుకున్న వారికి స్వర్ణ క‌మ‌లంతో పాటు ప‌ది ల‌క్షల క్యాష్ ప్రైజ్‌ను అందజేస్తారు.

ఈ అవార్డుని మొదటి సంవత్సరం దేవికారాణితో మొదలుపెట్టి ఇప్పటివరకు మొత్తం 66 మందికి అందించారు. తెలుగు నుంచి బి.ఎన్.రెడ్డి, ఎల్.వి ప్రసాద్, బి.నాగిరెడ్డి, పైడి జైరాజ్, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు, కళాతపస్వి విశ్వనాథ్ ,బాలచందర్ లను ఈ అత్యున్నత పురస్కారం వరించింది. ఇదిలా ఉంటే 29న జరగబోయే కార్యక్రమానికి ఫిల్మ్ అవార్డులు గెలిచిన‌వారంతా హాజ‌రుకానున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories