మన లారెన్స్ హర్ట్ అయ్యాడు!

మన లారెన్స్ హర్ట్ అయ్యాడు!
x
Highlights

రాఘవ లారెన్స్ తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. చిన్న డాన్సర్ గా సినిమా ప్రపంచంలోకి వచ్చి.. కొరియోగ్రాఫర్ గా.. నటుడిగా.. దర్శకుడిగా అంచెలంచెలుగా...

రాఘవ లారెన్స్ తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. చిన్న డాన్సర్ గా సినిమా ప్రపంచంలోకి వచ్చి.. కొరియోగ్రాఫర్ గా.. నటుడిగా.. దర్శకుడిగా అంచెలంచెలుగా ఎదిగాడు. ఇటీవల కాంచన 3 తో మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకుని జోరు మీదున్నాడు. అయితే, ఇపుడు ఆయన నొచ్చుకున్నాడంట. హిందీలో తన దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న కాంచన రీమేక్ లక్ష్మీబాంబ్ సినిమా విషయంలో తనకు గౌరవం దక్కలేదని చెప్పి ఆ సినిమా నుంచి తప్పుకున్నానంటున్నాడు.


'ఇలాంటి ఘటన ఏ దర్శకుడికీ జరగకూడదు' అంటూ బాధపడుతున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌. ఆయన 'లక్ష్మీబాంబ్‌' ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకొన్నారు. రాఘవ ప్రధాన పాత్రలో నటించిన 'కాంచన'కు ఇది హిందీ రీమేక్‌. కు రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌కుమార్‌, కియారా అడ్వాణీ జంటగా నటిస్తున్న 'లక్ష్మీబాంబ్‌' చిత్ర ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఈ విషయంలో తనకు గౌరవం ఇవ్వలేదని లారెన్స్ అంటున్నాడు.

'గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు అని తమిళంలో ఓ సామెత ఉంది. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం. నాకు ఆత్మాభిమానం ఉంది కాబట్టే 'లక్ష్మీబాంబ్‌' ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. నేను కారణం చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఒకటి'

'నా అనుమతి లేకుండా నాతో చర్చించకుండా పోస్టర్‌ను విడుదల చేసేశారు. ఇలా చేశారని నాకు మూడో వ్యక్తి ద్వారా తెలిసింది. ఓ దర్శకుడిగా ఇది ఎంత బాధాకరంగా ఉంటుందో నాకు తెలుసు. నాకు పోస్టర్‌ డిజైన్‌ కూడా నచ్చలేదు. ఇలాంటి ఘటన ఏ దర్శకుడికీ జరగకూడదు. ఇది నా సినిమాకు రీమేక్‌ కాబట్టి నేను స్క్రిప్ట్‌ను కూడా వెనక్కి ఇచ్చేయాలని అడగను. అలాగని ఈ సినిమాకు దర్శకుడిగా కొనసాగలేను. నాకు అక్షయ్‌ కుమార్ సర్‌ అంటే ఎంతో అభిమానం. అందుకే స్క్రిప్ట్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకోవడం లేదు. వారికి నచ్చిన దర్శకుడిని ఎంచుకోవచ్చు. త్వరలో అక్షయ్‌ను కలిసి విషయం చెప్తాను. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌. సినిమా మంచి విజయం అందుకోవాలని ఆశిస్తున్నాను' అని పేర్కొన్నారు రాఘవ.

Show Full Article
Print Article
Next Story
More Stories