రమణా.. లోడ్ ఎత్తాలిరా! .. జబర్దస్త్ లోకి కుమనన్ ఎంట్రీ

రమణా.. లోడ్ ఎత్తాలిరా! .. జబర్దస్త్ లోకి కుమనన్ ఎంట్రీ
x
kumanan seetharaman in jabardasth(File photo)
Highlights

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవరికీ ఎప్పుడు స్టార్డం వస్తుందో చెప్పలేం.. కొందరికి సినిమాల ద్వారా పేర్లు వస్తే మరోకొందరికి పాత్రల ద్వారా పేరు వస్తుంది. ఇక ఇంకొంతమందికి మాత్రం ఒకే ఒక్క డైలాగ్ తోనే ఎక్కడలేని క్రేజ్ వస్తోంది!

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవరికీ ఎప్పుడు స్టార్డం వస్తుందో చెప్పలేం.. కొందరికి సినిమాల ద్వారా పేర్లు వస్తే మరోకొందరికి పాత్రల ద్వారా పేరు వస్తుంది. ఇక ఇంకొంతమందికి మాత్రం ఒకే ఒక్క డైలాగ్ తోనే ఎక్కడలేని క్రేజ్ వస్తోంది! ఉదాహరణకు కమెడియన్ అలీకి రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఏందా చాటా అనే ఒకే ఒక్క డైలాగ్ తో మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఇలాగే ఒకే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు కుమనన్ సేతురామన్..

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో "రమణా.. లోడ్ ఎత్తాలిరా! చెక్‌పోస్ట్ పడతాది" అంటూ ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయాడు కుమనన్ సేతురామన్.. అంతకుముందు అల్లుడుశీను, సైరా మొదలగు సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన గుర్తింపు అయితే రాలేదు.. కానీ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆ ఒక్క డైలాగ్ చెప్పి ఎంతో పేరు సంపాదించుకున్నాడు. ఈ డైలాగ్ తో ఫేమస్ కావడంతో అందరు ఎవరి కుమనన్ సేతురామన్ అని గూగుల్ లో వెతకడం మొదలుపెట్టారు..

ఇక ఇప్పుడు ఆయన జబర్దస్త్ కామెడీ షోలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ టీం చేసిన స్కిట్‌లో కనిపించాడు. రమణ లోడ్ ఎత్తాలిరా అంటూ ఆయన చెబుతుంటే, నన్ను ఎత్తరా అంటూ మాస్ అవినాష్, కెవ్వు కార్తిక్ ఆయనతో చేసిన కామెడీ ఆకట్టుకుంది. వచ్చే వారం ఎపిసోడ్ ప్రసారం కానుంది. మరి ఈ స్కిట్ కుమనన్ కి ఎంత మంచి పేరును తీసుకువస్తుందో చూడాలి మరి..

కుమనన్ సేతురామన్ సినిమాల్లోకి రాకముందు సర్వీస్‌ ఇంజినీర్‌గా ఓ కంపెనీలో పనిచేసేవారు. ఆ తర్వాత సినిమాలపైన మక్కువతో 1984 వ సంవత్సరంలో చెన్నై నుంచి వైజాగ్ కి వచ్చారు. ఫోటోగ్రఫీ మీదా ఉన్న ఇష్టంతో సినిమాల్లో ఫోటోగ్రాఫర్ గా కొనసాగాలని అనుకున్నారు. మేఘం అనే సినిమాకి స్టిల్ ఫోటోగ్రాఫర్ గా సినీ కెరియర్ ని మొదలు పెట్టారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రధాన సెక్యూరిటీ ఆఫీసర్‌గా కూడా సేతురామన్‌ పనిచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories