సత్తా చాటిన తెలుగు సినిమాలు.. స్పందించిన కేటీఆర్

సత్తా చాటిన తెలుగు సినిమాలు.. స్పందించిన కేటీఆర్
x
Highlights

భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర అవార్డులను నిన్న(శుక్రవారం) ప్రకటించిన విషయం తెలిసిందే. జూరీ కమిటీ వివిధ చిత్రాలను పరిశీలించిన అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జయదేకర్ నివేదిక అందించారు.

దేశంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే జాతీయ చలన చిత్ర అవార్డు విజేతల వివరాలు నిన్న(శుక్రవారం) ప్రకటించారు. దేశ రాజధాని దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. అంతకు ముందు జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్రం సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు అందజేశారు. 66 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈసారి తెలుగు సినిమా తన సత్తాను చాటిన విషయం తెలిసిందే. ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ నటి అవార్డులను మహానటి చిత్రం గెలుచుకుంది. ఉత్తమనటిగా కీర్తి సురేష్ అవార్డు దక్కించుకుకోగా.. రంగస్థలం, చిలసౌ, అ! చిత్రాలు వివిధ కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. జాతీయ ఉత్తమ నటుడుగా ధనుష్ ఎంపికయ్యాడు. వడా చెన్నై సినిమాకు గానూ ఈయన నేషనల్ అవార్డ్ అందుకున్నాడు.

ఈ మేరకు తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్వీట్టర్ ద్వారా స్పందించారు. 66 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలకు పలు కేటగిరీల్లో అవార్డ్స్ రావడం, అరుదైన గౌరవం దక్కినట్లే. ఉత్తమ హీరోయిన్‌గా అవార్డు దక్కించుకున్న కీర్తి సురేష్‌కి, మహానటి టీంకి, డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి, నిర్మాత స్వప్న దత్‌కి, చి ల సౌ చిత్ర యూనిట్ కి, రంగస్థలం యూనిట్‌కి, అ! సినిమా యూనిట్ సభ్యులందరికీ నా ప్రత్యేక అభినందనలు అని తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories