ప్రభాస్ పెళ్లిపై ప్రకటన చేసిన కృష్ణంరాజు

ప్రభాస్ పెళ్లిపై ప్రకటన చేసిన కృష్ణంరాజు
x
Highlights

టాలివుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ ప్రభాస్. ఆయనను పెళ్లెప్పుడు చేసుకుంటాడంటూ టాలివుడ్ నుంచి బాలివుడ్ దాకా అడగనివారుండరు. బాహుబలి సినిమా తర్వాత...

టాలివుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ ప్రభాస్. ఆయనను పెళ్లెప్పుడు చేసుకుంటాడంటూ టాలివుడ్ నుంచి బాలివుడ్ దాకా అడగనివారుండరు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని అంతా అనుకున్నారు కానీ ఇప్పటికీ ఆ ముచ్చట తీరనేలేదు. అదిగో పెళ్లి ఇదిగో ముహూర్తం అంటూ తెగ రూమర్స్ పుట్టిస్తున్నారు. అందుకే ప్రభాస్ పెళ్లిపై ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన కృష్ణంరాజు.. ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడు? అని అందరూ నన్ను అడుగుతూనే ఉన్నారు. 'సాహో' సినిమా తర్వాత కచ్చితంగా ఉంటుంది. అని చెప్పేశారు. కృష్ణంరాజు ఇలా చెప్పడం కొత్తేమి కాదు.. గతంలో కూడా రెండు మూడుసార్లు ఇలానే చెప్పాడు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. మరి ఈసారైనా పెదనాన్న చెప్పిన మాటకు ప్రాధాన్యం ఇస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories