బిగ్ బాస్ 3 లో నా శిష్యుడు ఉన్నాడు... నా సపోర్ట్ ?

బిగ్ బాస్ 3 లో నా శిష్యుడు ఉన్నాడు... నా సపోర్ట్ ?
x
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ బిగ్ బాస్ 3 సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్ పై స్పందించాడు. దీపావళి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెబుతూ ఓ స్పెషల్ వీడియో...

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ బిగ్ బాస్ 3 సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్ పై స్పందించాడు. దీపావళి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెబుతూ ఓ స్పెషల్ వీడియో చేసాడు కౌశల్.. ప్రస్తుతం హౌస్ లో ఉన్న శ్రీముఖి, రాహుల్,బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా గురించి మాట్లాడాడు. ఇందులో ఎవరు విజేతలు అవుతారు అన్నది ఆడియన్స్ నిర్ణయిస్తారని, కానీ నేను మాత్రం అందరికి సపర్ట్ చేస్తూ న్యూట్రల్ గా ఉంటానని చెప్పుకొచ్చాడు. ఇందులో ఎవరు గెలిచినా నాకు సంతోషమే అని చెప్పుకొచ్చాడు కౌశల్..

ఇక అలీ రెజా గురించి కౌశల్ మాట్లాడుతూ "18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మోడల్‌గా ట్రైనింగ్ తీసుకొన్నాడు. అప్పుడు మేకోవర్ చేసి ఫస్ట్ ఫోటోషూట్ నేనే చేశాను. ర్యాంప్ మీద వాకింగ్ నేర్పాను. తొలి యాడ్ ఫిలిం కూడా నేనే డైరెక్ట్ చేశాను. తనకు ఫస్ట్ రెమ్యునరేషన్ కూడా నేనే ఇచ్చాను. అలాంటి అలీ రెజా ఫైనల్‌ ఉండటం నాకు ఆనందంగా ఉందని కౌశల్ చెప్పుకొచ్చాడు. "


Show Full Article
Print Article
More On
Next Story
More Stories