చిరంజీవి విడుదల చేసిన కౌసల్య కృష్ణమూర్తి టీజర్

చిరంజీవి విడుదల చేసిన కౌసల్య కృష్ణమూర్తి టీజర్
x
Highlights

కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేశ్ ఓ క్రికెటర్ గా అద్భుతంగా నటించిందని మెగాస్టార్ చిరంజీవి పొగడ్తల వర్షం కురిపించారు....

కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేశ్ ఓ క్రికెటర్ గా అద్భుతంగా నటించిందని మెగాస్టార్ చిరంజీవి పొగడ్తల వర్షం కురిపించారు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రం టీజర్ ను ఈరోజు మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ అధినేత కేఎస్ రామారావు, చిత్ర దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు సమక్షంలో చిరంజీవి ల్యాప్ టాప్ ద్వారా టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాలో క్రికెటర్ పాత్ర కోసం నాలుగు నెలల పాటు క్రికెట్ నేర్చుకుని సెట్స్ మీదకు రావడం ఆమె అంకితభావానికి నిదర్శనం అని మెచ్చుకున్నారు. ఐశ్వర్య రాజేశ్ తమ కొలీగ్ రాజేశ్ కుమార్తేనని తెలిసి ఎంతో సంతోషం కలిగిందని, ఐశ్వర్య మేనత్త, కమెడియన్ శ్రీలక్ష్మి అందరికీ తెలిసిన వ్యక్తేనని, వారి వారసురాలుగా ఐశ్వర్య ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్రం ఘనవిజయం సాధించాలంటూ ఆకాంక్షించారు.

చిరంజీవి విడుదల చేసిన కౌసల్య కృష్ణమూర్తి టీజర్కాగా, ఓ సాధారణ అమ్మాయి దేశం గర్వించేలా క్రికెట్ ఆటలో ఎలా ఎదిగిందన్న ఇతివృత్తంతో 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రాన్ని రూపొందించారు. తమిళంలో 'కణ' పేరుతో విడుదలైన చిత్రానికి రీమేక్ గా 'కౌసల్య కృష్ణమూర్తి' తెరకెక్కిస్తున్నారు. తమిళ మాతృకలో ప్రధాన పాత్ర పోషించిన ఐశ్వర్య రాజేశ్ తెలుగు చిత్రంలోనూ లీడ్ రోల్ చేస్తోంది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, కార్తీక్ రాజు ఇతర ముఖ్య తారాగణం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories