రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్ .. ఫోటోలు వైరల్

రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్ .. ఫోటోలు వైరల్
x
Amala Paul and Bhavinder Singh
Highlights

సినిమాలతో పాటు వ్యక్తిగత జీవిత విషయాల్లో కూడా అమలాపాల్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

సినిమాలతో పాటు వ్యక్తిగత జీవిత విషయాల్లో కూడా అమలాపాల్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తో ప్రేమాయణం నడిపిన అమలాపాల్ అతని పెళ్లి చేసుకుంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2017 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత విజయ్ మరో అమ్మాయి ని పెళ్లి చేసుకోవడం, దానిపై అమలాపాల్ స్పందించడం జరిగింది.

ఆ తర్వాత దర్శకుడు విజయ్ తండ్రి చేసిన ఆరోపణలతో మరోసారి వార్తల్లో నిలిచింది అమలాపాల్.. హీరో ధనుష్ తనని మళ్లీ సినిమాల్లో నటించాలని కోరడంతో విజయ్,అమలాపాల్ మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారని విజయ తండ్రి ఆరోపించాడు. అయితే ఆరోపణలను అమలాపాల్ కొట్టిపారేసింది. ఇక ప్రస్తుతం మీరు ప్రేమలో ఉన్నారా ? రెండో పెళ్లి చేసుకుంటారా అని అడగగా, చేసుకోకపోతే సన్యాసి లాగా ఉండిపోతమా ఎంటి ? కాకపోతే ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని అమలాపాల్ చెప్పుకొచ్చింది.


ఇక తాజాగా తాను ప్రేమలో ఉన్నానని అమలాపాల్ స్పష్టం చేసింది. కానీ అతను ఎవరు అన్న విషయంపై అమలాపాల్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ తరుణంలో ముంబైకి చెందిన సింగర్ భవిందర్ సింగ్ తో ఆమె ప్రేమలో ఉన్నట్టు రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమె అతన్ని రహస్యంగా రెండో పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా హల్ చల్ అవుతున్నాయి. హిందూ సాంప్రదాయ ఈ పద్ధతిలోనే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మరోసారి తన వ్యక్తిగత జీవిత విషయంలో వార్తల్లో నిలిచింది అమలాపాల్..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories