అప్పటివరకు ఓపిక పట్టండి.. రూమర్లు రాయొద్దు : అమలపాల్

అప్పటివరకు ఓపిక పట్టండి.. రూమర్లు రాయొద్దు : అమలపాల్
x
Amala Paul (File Photo)
Highlights

సినిమాలతో పాటు వ్యక్తిగత జీవిత విషయాల్లో కూడా అమలాపాల్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

సినిమాలతో పాటు వ్యక్తిగత జీవిత విషయాల్లో కూడా అమలాపాల్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తో ప్రేమాయణం నడిపిన అమలాపాల్ అతని పెళ్లి చేసుకుంది. ఇద్దరి మధ్యమనస్పర్థలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత విజయ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, దానిపై అమలాపాల్ స్పందించడం జరిగింది.

ఆ తర్వాత దర్శకుడు విజయ్ తండ్రి చేసిన ఆరోపణలతో మరోసారి వార్తల్లో నిలిచింది అమలాపాల్.. హీరో ధనుష్ తనని మళ్లీ సినిమాల్లో నటించాలని కోరడంతో విజయ్,అమలాపాల్ మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారని విజయ తండ్రి ఆరోపించాడు. అయితే ఆరోపణలను అమలాపాల్ కొట్టిపారేసింది. ఇక ప్రస్తుతం మీరు ప్రేమలో ఉన్నారా ? రెండో పెళ్లి చేసుకుంటారా అని అడగగా, చేసుకోకపోతే సన్యాసి లాగా ఉండిపోతమా ఎంటి ? కాకపోతే ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని అమలాపాల్ చెప్పుకొచ్చింది.

ఇక తాజాగా తాను ప్రేమలో ఉన్నానని అమలాపాల్ స్పష్టం చేసింది. కానీ అతను ఎవరు అన్న విషయంపై అమలాపాల్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ తరుణంలో ముంబైకి చెందిన సింగర్ భవిందర్ సింగ్ తో ఆమె ప్రేమలో ఉన్నట్టు రకరకాల వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అతన్ని రహస్యంగా రెండో పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. దీనిపైన కూడా అమలపాల్ స్పందించింది. తాను రెండో పెళ్లి చేసుకోలేదని తాను భాగస్వామిగా ఉన్న ఓ సంస్థ కోసం చేసిన ఫోటో షూట్ అని పేర్కొంది..

ఇటీవ‌ల త‌ను ఓ వ్యక్తిని ప్రేమించాన‌ని త్వర‌లోనే అత‌న‌ని పెళ్లి చేసుకుంటాన‌ని అమలపాల్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం తానూ సినిమాలతో బిజీగా ఉన్నానని, అవి పూర్తి అయ్యాకే పెళ్ళి గురించి వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది. ఇప్పటికే నా ప్రేమ గురించి చెప్పాను కదా....అలాగే పెళ్ళి గురించి కూడా చెబుతాను. అప్పటి వరకు కంగారు పడవద్దు. పుకార్లు పుట్టించవద్దని పేర్కొంది. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories