ఇంట్రెస్టింగ్ : RRRలో విజయ్ దళపతి ...?

ఇంట్రెస్టింగ్ : RRRలో విజయ్ దళపతి ...?
x
Rajamouli, Vijay (File photo)
Highlights

సినిమాలు చేయడమే కాదు.. ఆ సినిమాని ప్రమోట్ చేయడంలో టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిది అందవేసిన చేయి.. ఇప్పటికే ఈగ, బాహుబలి

సినిమాలు చేయడమే కాదు.. ఆ సినిమాని ప్రమోట్ చేయడంలో టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిది అందవేసిన చేయి.. ఇప్పటికే ఈగ, బాహుబలి లాంటి సినిమాలను ఇతర భాషలలో ప్రమోట్ చేసి సినిమాకి మంచి కలెక్షన్లు వచ్చేలా చేసుకున్నాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం).. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని కూడా రాజమౌళి పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కిస్తున్నాడు.

తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు. బహుబలి సినిమాని బాలీవుడ్ నిర్మాత ఆయున కరోన్ జోహార్ తో ప్రమోట్ చేసిన రాజమౌళి ఈ సినిమాను మాత్రం బాలీవుడ్ నటులను తీసుకొని ప్రమోషన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగణ్, ఆలియా భట్ వంటి స్టార్లు నటిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు తమిళ్ లో సినిమాని ప్రమోట్ చేసేందుకు రాజమౌళి సిద్ధం అవుతున్నారట.. ఎన్టీఆర్, చరణ్ లకి అక్కడ పెద్ద ఫాలోయింగ్ లేకపోవడంతో అక్కడి స్టార్ హీరోని లైన్ లో పెట్టేందుకు రాజమౌళి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించనున్నారని ఫిల్మ్ సర్కిల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో ఆయన ఓ అతిధి పాత్రలో మాత్రమే కనిపించనున్నారని టాక్. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు..ఇక కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఆయా భాషల స్టార్ హీరోలు ఇందులో నటించనున్నారని తెలుస్తోంది.

పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటిచింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories