రహమాన్ పాటలకు అలవాటు పడేందుకు సమయం పట్టింది

రహమాన్ పాటలకు అలవాటు పడేందుకు సమయం పట్టింది
x
Kamal Haasan (File Photo)
Highlights

ఇళయరాజా అంటే ఇష్టపడే తను రహమాన్ పాటలకు అలవాటు పడటానికి చాలా కాలం పట్టిందని కమల్ హాసన్ అన్నారు. ఇటీవలే కమల్ హాసన్ మరియు ఏఆర్ రహమాన్ లు ఒక లైవ్...

ఇళయరాజా అంటే ఇష్టపడే తను రహమాన్ పాటలకు అలవాటు పడటానికి చాలా కాలం పట్టిందని కమల్ హాసన్ అన్నారు. ఇటీవలే కమల్ హాసన్ మరియు ఏఆర్ రహమాన్ లు ఒక లైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ రహమాన్ తో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. రహమాన్ పాటలు మొదట్లో నాకు పెద్దగా నచ్చేవి కాదు అంటూ కమల్ వ్యాఖ్యానించారు. భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ గురించి అయన ఇలా అనడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

''భారతీయుడు సినిమాకు రహమాన్ ట్యూన్ చేసిన ఒక పాట అస్సలు నచ్చలేదు. ఆ పాట విషయంలో శంకర్ వద్ద అసంతృప్తి కూడా వ్యక్తం చేశాను. కాని ఆయన మాత్రం చాలా నమ్మకంగా సినిమాలో ఆ పాటను ఉంచారు. పాట చిత్రీకరణ పూర్తి అయ్యి ఫైనల్ మిక్సింగ్ తర్వాత వింటే చాలా బాగా నచ్చింది. ప్రేక్షకులు కూడా ఆ పాటను తెగ అభిమానించారు అంటూ కమల్ హాసన్ గతాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి 'తలైవాన్ ఇరుక్కిన్ద్రాన్' చిత్రం చేస్తున్నారు. రాజకీయాలతో బిజీగా ఉంటున్నా కూడా సినిమాలను వరుసగా చేస్తున్న రజినీకాంత్ మరో వైపు ఇండియన్ 2 చిత్రాన్ని కూడా చేస్తున్న విషయం తెల్సిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories