బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఈమే

AlluArjun
x
AlluArjun
Highlights

'నా పేరు సూర్య' సినిమా డిజాస్టర్ అయిన తరువాత చాలా కాలం మంచి స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసే పనిలో నిమగ్నమైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు 'అరవింద సమేత' తో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

'నా పేరు సూర్య' సినిమా డిజాస్టర్ అయిన తరువాత చాలా కాలం మంచి స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసే పనిలో నిమగ్నమైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు 'అరవింద సమేత' తో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ మధ్యనే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాపై అధికారిక ప్రకటనను విడుదల చేసింది. గీత ఆర్ట్స్ పతాకం తో సంయుక్తంగా బన్నీ త్రివిక్రమ్ సినిమా ను నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ మధ్య స్టార్ హీరోయిన్లతోనే రొమాన్స్ చేస్తున్న బన్నీ ఈ సినిమాలో ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటారు అని ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. ఈ మధ్యనే మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ కీయారా అద్వానీ. ఈమె త్వరలో మెగా హీరో రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' లో కూడా కనపడనుంది. ఇక మెగా హీరోతో రొమాన్స్ చేసిన ఈ భామ త్వరలో అల్లు హీరో తో కూడా నటించనుందనామాట. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైపోయాయి. మరోపక్క బాలీవుడ్ సినిమాలతో కూడా కీయారా బిజీగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories