logo

డిజిటల్ రైట్స్ ద్వారా భారీ మెత్తాన్ని పొందిన 'కే జీ ఎఫ్'

KGF MovieKGF Movie
Highlights

ఈ మధ్యకాలంలో ఒక్క కన్నడ లోనే కాక దేశమంతటా సంచలనం సృష్టిస్తున్న కన్నడ సినిమా 'కే జి ఎఫ్ చాప్టర్ 1'. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

ఈ మధ్యకాలంలో ఒక్క కన్నడ లోనే కాక దేశమంతటా సంచలనం సృష్టిస్తున్న కన్నడ సినిమా 'కే జి ఎఫ్ చాప్టర్ 1'. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఊర మాస్ హీరోగా యశ్ అద్భుతమైన నటన మరియు ప్రతి శ్రీను క్లైమాక్స్ ని తలపించేలా మలచిన ప్రశాంత్ నీరు దర్శకత్వం ప్రేక్షకులను బాగా మెప్పించింది. తెలుగు, హిందీ, తమిళ్ మరియు మలయాళం భాషల్లో కూడా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ విజయ ఢంకా మోగిస్తోంది. ఈ సినిమా ఇంకా థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది.

అటు థియేటర్లలోనే కాక ఇటు సినిమా రైట్స్ ద్వారా కూడా రికార్డుల మోత మోగిస్తోంది. 'కే జి ఎఫ్' సినిమా డిజిటల్ రైట్స్ ను తాజాగా అమెజాన్ ప్రైమ్ అక్షరాలా 18 కోట్ల రూపాయలు చెల్లించి కొనుక్కుంది. ఇప్పటిదాకా డిజిటల్ రైట్స్ ద్వారా ఇంత పెద్ద మొత్తాన్ని సాధించిన ఒకే ఒక కన్నడ సినిమా 'కెజీఎఫ్' కావడం విశేషం. మొత్తానికి ఈ సినిమా ప్రొడ్యూసర్లకు అలాగే డిస్ట్రిబ్యూటర్ల కు కూడా భారీ ప్రాఫిట్ లు తెచ్చిపెడుతోంది.


లైవ్ టీవి


Share it
Top