66వ జాతీయ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

66వ జాతీయ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
x
66 National awards
Highlights

66వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

66వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ కేటగిరీలలో ఎంపికైన వారికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అవార్డులను ప్రదానం చేశారు. అందులో భాగంగా మహానటి చిత్రానికిగాను ఉత్తమ నటిగా కీర్తిసురేశ్‌ అవార్డు అందుకుంది. ఇక. చి.ల.సౌ చిత్రానికి గాను ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే అవార్డును రాహుల్‌ రవీంద్రన్‌ అందుకున్నారు. ఉరి (హిందీ)చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా విక్కీకౌశల్‌, ఉత్తమ డైరెక్టర్‌గా ఆదిత్యాధర్‌ అందుకున్నారు. అందాదున్‌ చిత్రానికి ఆయుష్మాన్‌ ఖురానా బెస్ట్‌ యాక్టర్‌ అవార్డును అందుకున్నాడు.

66వ జాతీయ అవార్డులు...

ఉత్తమ చిత్రం: హోల్లారో(గుజరాతీ)

ఉత్తమ నటుడు: ఆయుష్మాన్ ఖురానా(అందా ధూన్), విక్కీ కౌశల్(యూరి)

ఉత్తమ నటి: కీర్తి సురేశ్(మహానటి)

ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్(యూరి)

ఉత్తమ సహాయనటుడు: స్వానంద్ కిర్‌కిరే(చంబక్)

ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ(బదాయి హో)

ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయి హో

ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్ మ్యాన్

ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపథ్య చిత్రం: పానీ(మరాఠీ)

ఉత్తమ పరిచయ దర్శకుడు: సుధాకర్ రెడ్డి యాకంటి(నాల్, మరాఠీ)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్

ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్

సంగీత దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్)

ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం(రాజా క‌ృష్ణన్)

ఉత్తమ యాక్షన్ చిత్రం: కె.జి.యఫ్ చాప్టర్ 1

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్: అ!, కె.జి.యఫ్ చాప్టర్ 1

ఉత్తమ సాహిత్యం: నాతి చరామి(కన్నడ)

ఉత్తమ స్ర్రీన్‌ప్లే: చి.ల.సౌ

ఉత్తమ మేకప్: అ!

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: మహానటి

ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: కుమార సంభవం(మలయాళం)

ఉత్తమ ఎడిటింగ్: నాతిచరామి

ఉత్తమ సౌండ్ డిజైనింగ్: యూరి

నర్గీస్ దత్ అవార్డ్: వండల్లా ఎరడల్లా(కన్నడ)

ఉత్తమ డైలాగ్స్: తారీఖ్(బెంగాలీ)

ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్(పద్మావత్)

ఉత్తమ గాయని: బిందు మాలిని(నాతి చరామి)

ఉత్తమ బాలనటుడు: పి.వి.రోహిత్, సాహెబ్ సింగ్, అర్షద్ రేసి, శ్రీనివాస్ షోకాలే


Show Full Article
Print Article
More On
Next Story
More Stories