చెత్తబుట్ట నుంచి హాట్ సీట్ వరకూ...కేబీసీలో దివ్యాంగురాలి ప్రతిభ!

చెత్తబుట్ట నుంచి హాట్ సీట్ వరకూ...కేబీసీలో దివ్యాంగురాలి ప్రతిభ!
x
Highlights

పక్షవాతం తో చురుగ్గా కదలని శరీరంపై తన మేధతో యుద్ధం చేసింది. తన ప్రతిభతో స్కూలు టీచర్లని మెప్పించింది. అదేప్రతిభతో బిగ్ బీ అమితాబ్ తో నిలబడి చప్పట్లు కొట్టేలా చేసింది.. ఆమె నేటి యువతకు ఆదర్శం.. మీకోసం ఆమె కథ!

"ఆమె చనిపోయిందని ముందుగా చెత్తబుట్టలో పడేసారు . కానీ ఆమె అదృష్టం కొద్ది బతికింది . కొన్ని రోజులకు పక్షవాతం అని చెప్పారు. చదువుకోవాలని ఉంటే దివ్యాంగుల పాఠశాలలో చేర్చండి అన్నారు . కానీ ఓ మంచి స్కూల్ లో చదువు నేర్చుకొని బీఏ వరకు చదివి బిగ్ బీ ముందు కౌన్‌బనేగా కరోడ్‌పతి లో పాల్గొని ఏకంగా పన్నెండు లక్షలు గెలుచుకొని ప్రతిభకి పట్టుదల తోడైతే ఏది అడ్డురాదుని నిరోపించింది. ఉత్తరప్రదేశ్‌ కి చెందినా నూపుర్‌ చౌహాన్‌... ఆమె పట్టుదలకి చూసే ప్రేక్షకులే కాదు బిగ్ బీ సైతం వావ్ అనేసాడు . పన్నెండు లక్షలు గెలుచుకొని స్టూడియో నుండి బయటకు వస్తుండగా ఒక్కసారి తన గతాన్ని గుర్తు చేసుకుంది నూపుర్‌ చౌహాన్"

నూపుర్‌ చౌహాన్ మాది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉన్నావ్‌లోని కపూర్‌పూర్‌. తండ్రి రాజ్ కుమార్ సింగ్ తల్లి కల్పన. మాది ఓ మధ్య తరగతి రైతు కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి . నా తల్లి గర్భంలో నేను ఉండగా నా తల్లి నాపై చాలా ఆశలు పెట్టుకుంది . కూతురు పేరు ఇలా పెట్టాలి . ఇలా పెంచాలి . ఇలాంటి చదువులు చదివించాలని... ఇక కాన్పు సమయంలో నేను సగం మాత్రమే బయటకొచ్ఛానంట. డాక్టర్ నన్ను మొత్తం బయటకు తీశాక ఎలాంటి కదలిక లేకపోవడంతో ఇక నేను చనిపోయనని నన్ను చెత్తబుట్టలో పడేశారట . కానీ ఇక చివరిసారిగా మా నాన్నమ్మ నా భుజం తట్టడంతో ఏడ్చాను. అలా నాలుగు నెలల తర్వాత పూర్తి కదలికలు రావడంతో నన్ను వైద్యం కోసం నా తల్లితండ్రులు చాలా ఆసుపత్రిలో చేర్చారు . ప్రసవం సమయంలో నా మెదడుకు గాయమై, కుడివైపు పూర్తిగా పక్షవాతం వచ్చిందని వైద్యులు చెప్పారు . ఓ నాలుగు సంవత్సరాల తర్వాత వాకర్ సహాయంతో నడవడం మొదలు పెట్టాను .

అ తర్వాత ఎనిమిదేళ్ళకు స్కూల్ కి తీసుకువెళ్తే దివ్యాంగుల పాఠశాలలో చేర్చండి అన్నారు . కానీ నా ఐక్యూ చెక్ చేసిన వైద్యులు సాధారణ పాఠశాలలో చదువుకోవచ్చునని చెప్పడంతో అమ్మానాన్న నన్ను మంచి స్కూల్ లో జాయిన్ చేసారు . అక్కడ స్కూల్ లో నాతో ఎవరు కలిసి ఉండేవారు కాదు . అక్కడే పనిచేసే అపర్ణాజోషి అనే టిచర్ చదువు , జీవితం విలువేంటో చెప్పడంతో చదువుకోవాలనే తపన నాలో కలిగింది . అప్పటినుండి ఇప్పటివరకు స్కూల్ లో టాపర్ గా నిలుస్తూ వస్తున్నాను . నా చదువుతో పాటు ఇంటికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ట్యూషన్స్ చెపుతున్నాను. అలా ఈ ఏడాది మేలో వచ్చినా కౌన్‌ బనేగా కరోడ్‌పతి ప్రకటన చూసి వారు అడిగినా ప్రశ్నలకు సమాధనం చెప్పాను . అన్ని అర్హతలు సాధించి బిగ్ బీ ముందు హాట్‌సీట్‌ వరకు చేరుకున్నాను . నా పై బిగ్ బీ ఇచ్చిన స్టాండింగ్‌ ఓవేషన్‌ అ తరువాత నన్ను చూస్తే గర్వంగా ఉందని అంటే ఏడుపొచ్చిందని చెప్పుకొచ్చింది నూపుర్‌ చౌహాన్

నూపుర్‌ చౌహాన్ ఈ షోలో మొత్తం 10 ప్రశ్నలకు టకటక సమాధానం చెప్పింది. అ తర్వాత ప్రశ్నల దగ్గర తడబడి 12 పన్నెండు లక్షల రూపాయలను గెలుచుకోని షో నుండి నిష్క్రమించింది . ఇలా ఇంకా బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఓ మంచి ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటానని చెప్పుకొచ్చింది నూపుర్‌ చౌహాన్...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories