Karthika Deepam: వంటలక్క దెబ్బకి మెగాస్టార్ సినిమా కూడా వెనక్కే

Karthika Deepam: వంటలక్క దెబ్బకి మెగాస్టార్ సినిమా కూడా వెనక్కే
x
Highlights

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అత్యధిక రేటింగ్ దూసుకుపోతుంది కార్తీక దీపం సీరియల్.. ఈ సీరియల్ కి రెంటింగ్ లో మరో సీరియల్ కి దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం.

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అత్యధిక రేటింగ్ దూసుకుపోతుంది కార్తీక దీపం సీరియల్.. ఈ సీరియల్ కి రెంటింగ్ లో మరో సీరియల్ కి దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం.. ఎంతో ప్రజాదరణ పొందిన తెలుగు బిగ్ బాస్ ను కూడా వెనుకకి నెట్టేసి తన అగ్రస్థానంలో కొనసాగింది అంటే ఈ సీరియల్ కి ఎంత ప్రాధాన్యత ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఇది ఇలా ఉంటే సాధారణంగా స్టార్ హీరోల హిట్ సినిమాలు టీవీలో ప్రసారం చేసినప్పుడు వాటికి అత్యధిక టీఆర్పీ రేటింగులు భారీ స్థాయిలో వస్తాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రాన్ని సంక్రాంతి పండగ కానుకగా జనవరి 15 న బుల్లితెరపై ప్రచారం చేశారు. కానీ టీఆర్పీ రేటింగ్స్ లో ఈ చిత్రం వెనుకబడి బార్క్ రేటింగ్స్ లో ఈ సినిమా 5వ స్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే కార్తీక దీపం సీరియల్ మాత్రం తొలిస్థానంలో దూసుకెళ్లింది. దీనితో స్టార్ హీరోల సినిమాలను కూడా దాటేసి అగ్రస్థానంలో నిలిచింది.

జనవరి 11 నుంచి జనవరి 17 రెండో వారం రేటింగ్స్ లో కార్తీక దీపం 14534 పాయింట్లు సాధించి మొదటిస్థానంలో ఉండగా, మెగాస్టార్ సైరా నరసింహా రెడ్డి చిత్రం 8741 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ సినిమా సైతం సైరాను దాటి 4వ స్థానంలో నిలిచింది. ఇక మొదటి రెండు మూడు స్థానాలలో వదినమ్మ, గోరింటాకు ధారావాహికలు ఉన్నాయి.

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కోకాపేటలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories