'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' విడుదల వాయిదా!

కమ్మరాజ్యంలో కడప రెడ్లు విడుదల వాయిదా!
x
రామ్ గోపాల్ వర్మ
Highlights

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం " కమ్మరాజ్యంలో కడప రెడ్లు ".. ఈ సినిమా మొదలు నుండి వివాదాలు క్రియేట్ చేసుకుంటూనే వస్తోంది.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం " కమ్మరాజ్యంలో కడప రెడ్లు ".. ఈ సినిమా మొదలు నుండి వివాదాలు క్రియేట్ చేసుకుంటూనే వస్తోంది. ఇక విడుదలైన రెండు చిత్ర ట్రైలర్లు కూడా పెద్ద దూమారాన్ని లేపాయి. సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చూట్టూ తిరుగుతుండడంతో ఈ సినిమాని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాని ఆపాలని ఇప్పటికే కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.

సినిమా రేపు విడుదల పెట్టుకొని సెన్సార్ బోర్డు ఇంకా సినిమాని చూడకపోవడంతో దర్శకుడు అర్జీవీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. సెన్సార్ బోర్డు సినిమాని చూసి సర్టిఫికెట్ ఇచ్చేలా చేయాలనీ అయన కోర్టును కోరారు. అయితే దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు సినిమాని మరో వారంలోపు చూడాలని సెన్సార్ బోర్డుని ఆదేశించింది. దీనితో రేపు విడుదల కావాల్సిన సినిమా ప్రస్తుతానికి వాయిదా పడింది. ఇక టైటిల్ విషయంలో వివాదం చోటు చేసుకోవడంతో సినిమా టైటిల్ ని 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'గా మార్చారు వర్మ .

వర్మ ఈ సినిమా తర్వాత జార్జిరెడ్డి ఫేం సందీప్ మాధవ్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్నీ ఇప్పటికే వర్మ ప్రకటించాడు కూడా.. హైదరాబాద్ దాదాల నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఈ సినిమాకి శివ సినిమా స్ఫూర్తి అని వర్మ పేర్కొన్నాడు. ఇదే కాకుండా ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అనే సినిమాని కూడా చేస్తున్నాడు వర్మ .. తాజాగా సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేశారు వర్మ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories