నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా' .. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకేక్కిన ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 15న విడుదల
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా' .. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకేక్కిన ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 15న విడుదల చేస్తున్నారు. శతమానం భవతి ఫేం సతీష్ వేగేశ్న దర్సకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మించారు. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన్ మేహ్రీన్ కథానాయకగా నటించింది.
సినిమా ప్రమోషన్ లో భాగంగా కళ్యాణ్ రామ్ సినిమా గురించి కొన్నిఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. " శతమానం భవతి సినిమాను నా భార్య థియేటర్‌కు వెళ్లి చూసి ఇంటికి వచ్చిన తర్వాత మీరెందుకు అలాంటి సినిమాలు చేయరు, కమర్షియల్ సినిమాలే ఎందుకు చేస్తారు? అని అడిగింది. అలాంటి కథ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని తనకు అప్పుడు చెప్పాను. అప్పుడు అదే సినిమా దర్శకుడితో ఈ కథ దొరికింది చేశాను. ముందుగా ఈ కథకి అల్ ఈజ్ వెల్ " అనే టైటిల్ ని పెట్టారు. కానీ సతీష్ విగ్నేశ సినిమాలు అన్ని అచ్చ తెలుగులో ఉంటాయి. శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం దీనికి కూడా అచ్చ తెలుగు టైటిల్ ని పెడదామని నేను చెప్పాను. అప్పుడు ఈ సినిమాని ఎంత మంచివాడవురా అనే టైటిల్ ని ఫిక్స్ చేశాం. ఈ సినిమా టైటిల్ ని నమ్మిన బంటు సినిమాలోని పాటలోని లిరిక్స్ నుంచి తీసుకున్నామని చెప్పుకొచ్చారు.
ముందుగా ఈ కథను చేస్తున్నానని చెప్పినప్పుడు తమ్ముడు తారక్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత నేను కొంత విరామం తీసుకొని మా నిర్మాణ సంస్థలో తారక్‌తో మళ్లీ ఓ చిత్రం చేస్తానని చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్ .. గతంలో వీరి కాంబినేషన్ లో జై లవ కుశ అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందించింది..
ఇక ఎంత మంచివాడవురా సినిమాకి గోపిసుందర్ సంగీతం అందించారు. కళ్యాణ్ రామ్ తో పాటు టి.ఎన్.ఆర్, తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు, అన్నపూర్ణమ్మ, సుధర్శన్, భద్రం, సుభలేఖ సుధాకర్, పవిత్ర లోకేష్ తదితరులు నటించారు..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire