కళ్యాణ్ రామ్ కాన్ఫిడెన్స్ ఏంటి ? రిస్క్ చేస్తున్నాడా ?

కళ్యాణ్ రామ్ కాన్ఫిడెన్స్ ఏంటి ? రిస్క్  చేస్తున్నాడా ?
x
Highlights

తెలుగు సినిమాలకి సంక్రాంతి పండగ మంచి మార్కెట్ అని చెప్పాలి.. సినిమా ఏ మాత్రం బాగున్నా సరే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సంక్రాంతికి బడా బడా సినిమాలు లైన్...

తెలుగు సినిమాలకి సంక్రాంతి పండగ మంచి మార్కెట్ అని చెప్పాలి.. సినిమా ఏ మాత్రం బాగున్నా సరే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సంక్రాంతికి బడా బడా సినిమాలు లైన్ లో ఉన్నాయి. అందులో స్టార్ హీరోస్ అయిన మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు ఇప్పటికే విడుదల తేదీలను ప్రకటించాయి. జనవరి 12న ధియేటర్ లోకి రానున్నాయి. ఇక అదే సమయానికి నేను కూడా సిద్దమే అంటున్నారు కళ్యాణ్ రామ్ ...

సతీష్ విగ్నేశ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా' అనే సినిమాని చేస్తున్నాడు. పూర్తి కుటుంబ కథ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. మేహరీన్ కథానాయకగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్, సినిమా టిజర్ సినిమాపైన మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. అయితే ఇద్దరు స్టార్ హీరోలకి పోటిగా విడుదలవుతున్న ఈ సినిమా ఎంత వరకు తట్టుకుంటుంది. ? తట్టుకొని నిలబడుతుందా? అసలు కళ్యాణ్ రామ్ కాన్ఫిడెన్స్ ఏంటి ? రిస్క్ చేస్తున్నాడా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

నిజానికి కళ్యాణ్ రామ్ కి పటాస్ సినిమా తర్వాత మంచి హిట్టు అయితే లేదు.. మధ్యలో చేసిన సినిమాలు అన్ని బెడిసి కొట్టాయి. ప్రస్తుతం ఓ ఫ్యామిలీ సెంటిమెంట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. సో ఫ్యామిలీ కథ కాబట్టి సంక్రాంతి విడుదల చేస్తేనే బెటర్ అని చిత్ర యూనిట్ ముందు నుండి భావిస్తుంది. అంతేకాకుండా హీరో , దర్శకుడుకి లాస్ట్ హిట్లు కూడా సంక్రాంతికే వచ్చాయి. సో పనిలో పనిగా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందని భావించారు కావచ్చు. ఎంతైనా తెలుగు వారికీ సెంటిమెంట్స్ ఎక్కువే కదా.. !

Show Full Article
Print Article
More On
Next Story
More Stories