రాముడు కూడా మంచోడేరా... కానీ రావణాసురుడుని వేసెయ్యలా...

రాముడు కూడా మంచోడేరా... కానీ రావణాసురుడుని వేసెయ్యలా...
x
Highlights

పటాస్ సినిమా తర్వాత సరైనా హిట్టు కోసం ప్రయత్నం చేస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్ ...ప్రస్తుతం శతమానం భవతి ఫేం సతీష్ విగ్నేశ తో 'ఎంత మంచివాడవురా'...

పటాస్ సినిమా తర్వాత సరైనా హిట్టు కోసం ప్రయత్నం చేస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్ ...ప్రస్తుతం శతమానం భవతి ఫేం సతీష్ విగ్నేశ తో 'ఎంత మంచివాడవురా' అనే సినిమాని చేస్తున్నాడు. సినిమాకి సంబంధించిన టిజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్ . పూర్తి ఫ్యామిలీ కథాంశంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. హీరో మచివాడని అతని కుటుంబ సభ్యులు చెప్పడం నుండి చిత్ర టిజర్ మొదలవుతుంది. ఇక "రాముడు కూడా మంచోడేరా... కానీ రావణాసురుడుని వేసెయ్యలా..." అనే కళ్యాణ్ రామ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని ఉమేష్ గుప్తా,సుభాష్ గుప్తా కలిసి శ్రీదేవి మూవీస్ పై నిర్మిస్తున్నారు. మేహరీన్ కథానాయకగా నటిస్తుంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories