నాలుగోసారి తేజా..కాజల్..?

నాలుగోసారి తేజా..కాజల్..?
x
Highlights

ఒక దర్శకుడు.. ఒక హీరో.. కల్సి ఓ సూపర్ హిట్ ఇస్తే.. వారిద్దరి కాంబినేషన్లో నాలుగైదు సినిమాలు కచ్చితంగా వచ్చేస్తాయి. ఒక హీరో.. ఒక హీరోయిన్ జతగా...

ఒక దర్శకుడు.. ఒక హీరో.. కల్సి ఓ సూపర్ హిట్ ఇస్తే.. వారిద్దరి కాంబినేషన్లో నాలుగైదు సినిమాలు కచ్చితంగా వచ్చేస్తాయి. ఒక హీరో.. ఒక హీరోయిన్ జతగా ఇండస్ట్రీలో ఓ హిట్టేసుకున్నారంటే..ఇక వరుసగా వాళ్ళ కాంబినేషన్ సెట్స్ మీదే ఉంటుంది. అయితే.. ఇటీవలి కాలంలో అటువంటి కాంబినేషన్లు కూడా పెద్దగా రిపీట్ కావడం లేదు. అదే.. ఒక దర్శకుడు.. ఒక హీరోయిన్ కాంబినేషన్ రెండు సార్లు రిపీట్ అయితే గొప్పే. మూడోది కూడా వచ్చిందంటే అది స్పెషల్ కాంబినేషన్. మరి నాలుగో సినిమా కూడా చేస్తారని వినిపిస్తే.. కచ్చితంగా అది సెన్సేషన్.

అదే సెన్సేషన్ చోటుచేసుకుంటోందిప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో . ఆ నటి ఎవరో కాదు చందమామ కాజల్ అగర్వాల్.. దర్శకుడు మీకీపాటికి అర్థం అయిపోయి ఉండాలి.. లేదా.. తేజ! అవును తెలుగు తెరకు కాజల్ ని పరిచయం చేసిన దర్శకుడు తేజ మరో సినిమా కి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారట. అది కాజల్ కోసమే అని సినీ వర్గాలు చెబుతున్న మాట. లక్ష్మీ కళ్యాణం తో మొదటి సినిమా ఇచ్చి.. నేనే రాజు నేనే మంత్రితో మాలి హిట్ ఇచ్చిన తేజా.. కాజల్ తో ఈ మధ్య సీత తెరకెక్కించారు. అది అనుకున్నంత సక్సెస్ కాకపోయినా మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సిద్ధం కాబోతున్నాడన్న వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే జరిగితే వీరి కాంబినేషన్ సంచలనమ్ సృష్టించినట్టే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories