సీత లో కాజల్ డామినేషన్!

సీత లో కాజల్ డామినేషన్!
x
Highlights

చాలా మంది హీరోలు నో చెప్పారు. అందరూ కథ బాగుందన్నారు. కానీ, తాము చేయలేమని చెప్పేశారు. చివరికి బెల్లం కొండ శ్రీనివాస్ సీతతో జతకట్టడానికి ఒప్పుకున్నాడు....

చాలా మంది హీరోలు నో చెప్పారు. అందరూ కథ బాగుందన్నారు. కానీ, తాము చేయలేమని చెప్పేశారు. చివరికి బెల్లం కొండ శ్రీనివాస్ సీతతో జతకట్టడానికి ఒప్పుకున్నాడు. ఇదంతా తేజ దర్శకత్వంలో వస్తోన్న సీత హీరో కథ. అవును.. సీత సినిమాలో చేయడానికి మన హీరోలెవరూ ముందుకు రాలేదట. పేర్లు చెప్పలేదు కానీ, ఈ విషయాన్ని దర్శకుడు తేజ సవ్యంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎందుకు నో అన్నారో కారణం కూడా చెప్పాడు తేజ. సినిమాలో కాజల్ డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. హీరోయిన్ డామినేషన్ వున్న సినిమాలో చేయడానికి వాళ్లంతా వెనుకడుగు వేశారు అన్నారు తేజ. బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం సరే అని ఒప్పుకున్నారన్నారు తేజ. సినిమా చాలా బాగా వచ్చిందని.. అని హంగులతో అందరూ మెచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తేజ అన్నారు. ప్రస్తుతం సీత మీద భారీ అంచనాలు లేనప్పటికీ విడుదలయ్యాక చిత్ర కథే దానికి సమాధానం చెబుతుందని తేజ అంటున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. కాజల్ డామినేషన్ ట్రైలర్ లో కనిపించింది. కానీ, హీరో కి కూడా మంచి డైలాగులు ఉన్నట్టు ట్రైలర్ లో తెలిసింది. మరి హీరోలంతా ఎందుకు వెనక్కి తగ్గారో సినిమా విడుదలైన తరువాత క్లారిటీవస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories