ఫ్రెండ్ పెళ్లిలో కాజల్ సందడి.. పిక్స్ వైరల్

ఫ్రెండ్ పెళ్లిలో కాజల్ సందడి.. పిక్స్ వైరల్
x
Kajal agarwal
Highlights

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు అయిన ఇంకా హీరోయిన్ గానే కొనసాగుతుంది అందాల భామ కాజల్ అగర్వాల్.. అందరూ స్టార్ హీరోలతో కలిసి

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు అయిన ఇంకా హీరోయిన్ గానే కొనసాగుతుంది అందాల భామ కాజల్ అగర్వాల్.. అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించి టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచింది కాజల్ .. ఇక ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గానే నటిస్తూనే అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ లలో కనిపిస్తుంది కాజల్.. ఇక ఫుల్ గ్లామర్ పోజులతో తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.. ప్రస్తుతం కాజల్ కి సినిమా ఆఫర్స్ అయితే పెద్దగా లేవనే చెప్పాలి. కమల్ - శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది కాజల్. ఇదే కాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే కాజల్ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ పెళ్లికి హాజరై సందడి చేసింది. ఈ వివాహ వేడుకలో కాజల్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది . తన కుటుంబంతో బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది కాజల్.. తనకు ఆ పెళ్లి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, వీకెండ్ ఎంతో సరదాగా గడించిందని అందులో పేర్కొంది కాజల్ .. ఫోటోలను కాజల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో ప్రస్తుతం ఫోటోలు వైరల్ గా మారాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories