కాజల్ వయసు 85 ఏళ్ళు..

కాజల్ వయసు 85 ఏళ్ళు..
x
Highlights

ఇందులో కాజల్ 85 ఏళ్ళు వయసు గల ఓ బామ్మ పాత్రలో నటిస్తుంది. పోరాట మర్మకళలు తెలిసిన బామ్మగా నటిస్తోంది.

కాజల్ అగర్వాల్ పెద్దగా పరచయం అక్కరలేని పేరు.. అందం, అభినయంతో ఆకట్టుకునే నటి.. లక్ష్మి కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ తెలుగులో అందరు స్టార్ హీరోలతో కలిసి నటించి ఓ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తమిళ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది. అయితే ఇందులో కాజల్ పాత్ర ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇందులో కాజల్ 85 ఏళ్ళు వయసు గల ఓ బామ్మ పాత్రలో నటిస్తుంది. పోరాట మర్మకళలు తెలిసిన బామ్మగా నటిస్తోంది. ఇకే ఇదే సినిమాలో కమల్ హసన్ 90 ఏళ్ల వృద్ధుడి పాత్రలో కనిపించనున్నాడు. రకుల్ ,సిద్ధార్థ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం భోపాల్ లో షూటింగ్ జరుపుకుంటుంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories