మహిళ ఫిర్యాదుతో వర్మ పై కేసు నమోదు

మహిళ ఫిర్యాదుతో వర్మ పై  కేసు నమోదు
x
రామ్ గోపాల్ వర్మ
Highlights

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయింది. అయన తాజాగా తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రంలో

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయింది. అయన తాజాగా తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రంలో భాగంగా ప్రముఖ మత ప్రభోధకుడు కేఏ పాల్ నుంచి సెన్సార్ సర్టిఫికేట్ అందుకున్తున్నట్టుగా ఓ మార్ఫింగ్ ఫోటోను వర్మ తన అధికార ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో వర్మ,కేఏ పాల్ తో పాటు అయన సహాయకురాలు జ్యోతి కూడా ఉంది. అయితే దీనిని ఎవరో ఎడిట్ చేశారో తెలియదు కానీ ఆర్జీవీ మాత్ర్రం తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే డిలిట్ చేశాడు. అయితే దీనిపైన పాల్ సహాయకురాలు జ్యోతి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను కలసి ఫిర్యాదు చేశారు.

వర్మ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా పైన సెన్సార్ బోర్డు సుమారు 90 కట్‌లు చెప్పింది. అయితే, దీనిపై వర్మ రివైజింగ్ కమిటీకి వెళ్లాడు. అక్కడ కొన్ని కట్ లతో ఈ సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీనితో ఈ సినిమాని డిసెంబర్ 12 న రిలీజ్ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా వర్మ ఈ సినిమాని తెరకెక్కించాడని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్స్ సినిమా పైన పెద్ద దుమారాన్ని లేపాయి. ఇక సినిమా విడుదలయ్యాక మరెన్ని సంచలనాలను క్రియేట్ చేస్తయాన్నది చూడలి మరి. ప్రస్తుతం వర్మ మరో రెండు సినిమాలని చేస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories