కళాత్మక దృశ్యకావ్యం 'శంకరాభరణం' కి 40 ఏళ్ళు

కళాత్మక దృశ్యకావ్యం శంకరాభరణం కి 40 ఏళ్ళు
x
Highlights

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్ లు గా నిలిచాయి. మరికొన్ని కలెక్షన్ల సునామీలను సృష్టించాయి. కానీ...

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్ లు గా నిలిచాయి. మరికొన్ని కలెక్షన్ల సునామీలను సృష్టించాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రని వేశాయి. అందులో ఒకటి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన 'శంకరాభరణం'. ఈ సినిమాని పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై ఏడిద నాగేశ్వరరావు - ఆకాశం శ్రీరాములు దీన్ని నిర్మించారు . ఇందులో శంకరశాస్త్రిగా సోమయాజులు, తులసి పాత్రలో మంజుభార్గవి నటించి మెప్పించారు. పూర్తి సంగీత ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎవరు ఉహించనంతగా సంచలన విజయాన్ని అందుకుంది.

ఇది ఒక్క తెలుగులోనే కాదు పక్క రాష్ట్రాలైన తమిళనాడు , కర్ణాటక, కేరళలలో కూడా అఖండ విజయం సాధించింది . అమెరికాలో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్టమొదటి చిత్రం ఇదే. కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించిందనే చెప్పాలి. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి మేలిమలుపు అయ్యింది. ఈ సినిమా విడుదల తరువాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా ప్రేక్షకులకి ఎంత నచ్చిందో.. తెలుగులో స్వర్ణకమలం అందుకున్న తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాలోని గాయకులు అయిన ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కు ఉత్తమ నేపధ్య గాయకుడిగా తొలిసారి జాతీయ అవార్డు , శ్రీమతి వాణిజయరాంకు ఉత్తమ గాయకురాలిగా , కె.వి.మహదేవన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు లభించాయి.

విశ్వనాధుని దర్శకత్వం తర్వాత ఈ చిత్రానికి కేవీ మహదేవన్ అందించిన సంగీతమే మరో ఆయువుపట్టుగా నిలిచింది. ఈ సినిమా పాటలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉన్నాయి. ఇక ఆ తర్వాత సినిమాల్లోని ఒక్కో సన్నివేశానికి జంధ్యాల రాసిన మాటలు ఆత్యఅత్యద్భుతంగా నిలిచాయి. అందుకు చక్కటి ఉదాహరణగా.. " బ్రోచేవారెవరు రా... ఈ రాగలను అవహేళనగా గానం చేస్తున్న పండితుతో శాస్త్రి గారు కొపావెశంతో 'ఆకలి వేసిన బిడ్డ అమ్మా! అని ఒకలా అరుస్తాడు. నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా! అని ఒకలా అరుస్తాడు. ప్రతీ శబ్దానికి ఒక ప్రత్యేకమైన శృతి ఉంది, నాదం ఉంది. తాదాత్మ్యం పొందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి గంగాజలంలా పెల్లుబికిన భావమది, గీతమది. ఆధునికత పేరుతో, మిడి మిడి జ్ఞానంతో మన పూర్వీకులు మనకిచ్చిన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమమైన సంగీతాన్ని నాశనం, అపభ్రంశం చేయకయ్యా!' అని చెప్పే మాట ఆకట్టుకుంటుంది. ఎన్ని సినిమాలు వచ్చిన పోయిన ఈ తెలుగు సినిమా బ్రతికి ఉన్నంత కాలం ప్రేక్షకుల మనసుల్లో
ఎప్పటికి శాశ్వతంగా ఉండిపోతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories