NTR రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే ...

NTR రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే ...
x
Highlights

నందమూరి తారకరామారావు హీరోగా నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో బాలనటుడుగా తెలుగు చిత్ర పరిశ్రములోకి అడుగుపెట్టాడు ఎన్టీఆర్.. తరువాత బాల రామాయణము...

నందమూరి తారకరామారావు హీరోగా నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో బాలనటుడుగా తెలుగు చిత్ర పరిశ్రములోకి అడుగుపెట్టాడు ఎన్టీఆర్.. తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించి ఆకట్టుకున్నాడు. ఇక 2001లో వచ్చిన నిన్ను చూడాలని అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, ఆది,యమదొంగ, ఇలా పలు సినిమాల్లో నటించి టాలీవుడ్ టాప్ హీరోల లిస్టులో ఒకడిగా చేరాడు ఎన్టీఆర్.. అయితే కథల ఎంపీకలో భాగంగా ఎన్టీఆర్ కొన్ని సినిమాలకి వదులుకున్నాడు. ఆ సినిమాలు వేరే హీరోలు చేసారు. అవి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్లుగా నిలిచాయి. మరి ఎన్టీఆర్ వదిలేసినా ఆ బ్లాక్ బ్లస్టర్ హిట్లు ఏంటో ఒక్కసారి చూద్దాం..

దిల్:

ఆది సినిమా మంచి హిట్టు కావడంతో హీరోగా ఎన్టీఆర్ పేరు, దర్శకుడుగా వివి వినాయక్ పేరు మారుమ్రోగింది. అందులో భాగంగానే ఆ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసిన రాజు వీరి కాంబినేషన్ లో తన మొదటి సినిమాని చేయాలనీ అనుకున్నారు. అందుకు గాను వివి వినాయక్ కి ముందుగానే అడ్వాన్సు కూడా ఇచ్చేసాడు రాజు.. ఇక దిల్ కథ ఎంపీక పూర్తి అయ్యాక సినిమాని ఎన్టీఆర్ కి వెళ్లి చెబితే అయన ఈ కథని రిజెక్ట్ చేసారట.. ! అదే కథతో హీరో నితిన్ పెట్టి తీశారు. ఈ సినిమా నితిన్ కెరియర్ కి బాగా ఉపయోగపడింది. ఇక ఈ సినిమాతో రాజు కాస్తా దిల్ రాజుగా మారిపోయాడు.

ఆర్య :

అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం అనే చెప్పాలి. అప్పుడెప్పుడో వచ్చిన గంగోత్రి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో మళ్ళీ ఎంట్రి ఇచ్చి మంచి లవర్ బాయ్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో సుకుమార్ అనే టాలెంటెడ్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ఈ కథ ముందుగా ఎన్టీఆర్ కి చెప్పారట.. కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో ఈ కథ అల్లరి నరేశ్ నుండి అల్లు అర్జున్ వరకు వెళ్ళింది.

భద్ర:

దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దగ్గర చాలా రోజులుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బోయపాటి శ్రీను భద్ర సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు. మొదటగా ఈ సినిమాని బన్నీతో తీయాలని అనుకున్నాడట బోయపాటి. కానీ కథ బన్నీకి ఒకే అయిన సినిమాలో మాస్ ఎలిమెంట్స్ బాగా ఉండడంతో ఇదే సినిమాని గీతా ఆర్ట్స్ లోనే వేరే హీరోతో చేద్దామని అల్లు అరవింద్ అన్నారట. ఈ క్రమంలో ఎన్టీఆర్ కి ఈ కథ చెప్పగా అయన రిజెక్ట్ చేసారట.. ఆ తర్వాత దిల్ రాజ్ బ్యానర్ లోకి ఈ సినిమా వెళ్ళగా రవితేజ హీరోగా సినిమా తెరకెక్కింది.

అతనొక్కడే :

ఈ సినిమాతో సురేందర్ రెడ్డి అనే దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ముందుగా ఈ కథను ఎన్టీఆర్ కి చెప్పాడట సురేందర్ రెడ్డి. కానీ ఈ కథపై ఎక్కువగా ఆసక్తి చూపించలేదట ఎన్టీఆర్, అదే కథతో ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మించి హీరోగా నటించారు. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లో మంచి హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ కి హిట్టు రావడానికి పదేళ్ళు పట్టింది.

కిక్ :

ఈ సినిమాకి ముందు సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఉసరవెల్లి అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి సినిమా చేయాలనీ అనుకున్నారు. అప్పుడు కిక్ అనే కథతో ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాడు సురేందర్ రెడ్డి .ఎన్టీఆర్ కి కథ నచ్చింది కానీ అప్పటికే వేరే సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉండడంతో ఈ సినిమాని చేయలేకపోయాడు. రవితేజ కెరియర్ కి ఈ సినిమా ఓ బూస్ట్ లాగా పనిచేసింది.

కృష్ణ;

ఎన్టీఆర్ వివి వినాయక్ కాంబినేషన్ కి మంచి పేరుంది. ఇక కృష్ణ సినిమాని చేద్దామని అనుకున్నారట. కానీ కథ విషయంలో ఎన్టీఆర్ ఆసక్తి చూపించకపోవడంతో కథ రవితేజ దగ్గరికి వెళ్ళింది. మాస్ కం కామెడీ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

శ్రీమంతుడు:

అప్పటికే ప్లాప్ లలో ఉన్న మహేష్ బాబుకి ఈ సినిమా మహేష్ కెరియర్ లోనే టాప్ లో ఉండిపోయింది. ఈ సినిమా కథను కూడా ముందుగా ఎన్టీఆర్ కి వినిపించారట కొరటాల ... కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో మహేష్ బాబు దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

దాదాపుగా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని దర్శకుల మొదటి సినిమాలు కావడం విశేషం..

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఎక్కువ సినిమాలని రవితేజ చేసారు.

హిట్టు సినిమాలు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అందులో బ్రహ్మోత్సవం సినిమా ఒకటి ..

ఎన్టీఆర్ రిజక్ట్ చేసిన దర్శకులతో మళ్ళీ సినిమాలు చేయడం విశేషం..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories