చీపురు ప‌ట్టిన యంగ్ టైగ‌ర్‌.. చిరు, నాగ్ లకి సవాల్

చీపురు ప‌ట్టిన యంగ్ టైగ‌ర్‌.. చిరు, నాగ్ లకి సవాల్
x
Jr. NTR
Highlights

కరోనా కట్టడికి కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసిందే.. దీనితో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యారు.

కరోనా కట్టడికి కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసిందే.. దీనితో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఇక సెలబ్రిటీలు సైతం ఇంట్లోనే ఉంటూ అభిమానులకి కరోనా పై అవగాహనా కల్పిస్తూ తమ ఇంట్లోనే కాలం గడుపుతున్నారు. అంతేకాకుండా ఇంట్లోనే ఉంటూ భార్యలకు కూడా సాయం చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్, నాగార్జున వంట చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే..

ఇక తాజాగా అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగ ఇంటి పనులు చేస్తూ వీడియోను పోస్టు చేశాడు. ఇంటి పనులు చేస్తూ భార్యకు సాయం చేసేవాడే రియల్ మ్యాన్ అంటూ...టాలీవుడ్ లో "బీ ది రియల్ మెన్" ఛాలంజ్ అనే ట్రెండ్ కి నాంది పలికారు. ఇక ఈ వీడియోని ట్వీట్ చేస్తూ రాజమౌళికి సవాల్ విసిరాడు. దీనిని స్వీకరించిన రాజమౌళి చీపురు పట్టి ఇల్లు ఉడ్చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్, చరణ్ లకి ఛాలెంజ్ విసిరారు.. వీరితో పాటుగా దర్శకుడు సుకుమార్, నిర్మాత శోభు యార్లగడ్డ, తన పెద్దన్న కీరవాణికి కూడా సవాల్ చేసాడు రాజమౌళి.

అయితే ఈ సవాల్ ని స్వీకరించిన ఎన్టీఆర్ ఇంటిని తూడ‌వ‌డం, చుట్టు ప‌క్క‌ల ప‌రిస‌రాల‌ని శుభ్రం చేయడం, కిచెన్ లో ఉన్నటువంటి వస్తువులను శుభ్రం చేస్తున్న పనులను మనం ఎన్టీఆర్ షేర్ చేసిన వీడియోలు గ‌మ‌నించ‌వ‌చ్చు. మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం. మీరు పని భారాన్ని పంచుకున్నప్పుడు ఇది సరదాగా ఉంటుంది అని ఎన్టీఆర్ తెలిపారు. ఆ తరవాత బాబాయ్ బాలయ్య, చిరంజీవి, నాగార్జున , వెంకటేష్ , దర్శకుడు శివ కోరటాలకి ఛాలెంజ్ విసిరారు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్(రౌద్రం రణం రుధిరం).. అనే చిత్రంలో నటిస్తున్నాడు.. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories