ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఫ్యాన్స్ కి హోలీ గిఫ్ట్

ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఫ్యాన్స్ కి హోలీ గిఫ్ట్
x
Highlights

ఈ ఫోటోపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ .. 'చిన్నవాడు కెమెరా వైపు చూస్తున్న విధానం ఏదో చెబుతుంది.. వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు. లిటిల్ టైగర్.. వస్తున్నాడు'. అంటూ స్పందించాడు.

హోలీ పండగ సందర్భంగా ఎన్టీఆర్ తన భార్య ల‌క్ష్మీ ప్రణ‌తి, కుమారులు అభ‌య్ రామ్‌, భార్గవ్ రామ్‌ల‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ తన అభిమానులకి శుభాకాంక్షల్ని తెలియజేశారు ఎన్టీఆర్.. ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. వైట్ అండ్ వైడ్ డ్రెస్‌లో అందరూ ముఖానికి రంగులు పూసుకుని హోలీ పండగను చాలా ఆనందంగా జరుపుకున్నారు. ఇక ఎన్టీఆర్ పిల్లలు చాలా క్యూట్‌ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటోపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ .. 'చిన్నవాడు కెమెరా వైపు చూస్తున్న విధానం ఏదో చెబుతుంది.. వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు. లిటిల్ టైగర్.. వస్తున్నాడు'. అంటూ స్పందించాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ) అనే చిత్రంలో నటిస్తున్నాడు.. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని 400 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని జులై 30 న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం ముందుగా ప్రకటించినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి టైం సరిపోకపోవడంతో 2021 జనవరి 8న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories