రాజశేఖర్‌ది చిన్నపిల్లల మనస్తత్వం: జీవిత

రాజశేఖర్‌ది చిన్నపిల్లల మనస్తత్వం: జీవిత
x
జీవిత
Highlights

'మా' డైరీ ఆవిష్కరణ‌లో జరిగిన వివాదంపై జీవితా రాజశేఖర్‌ స్పందించారు. రాజశేఖర్‌ది చిన్న పిల్లల మనస్తత్వమన్నారు ఆయన సతీమణి జీవిత. ఎవరినీ కావాలని అగౌరవ...

'మా' డైరీ ఆవిష్కరణ‌లో జరిగిన వివాదంపై జీవితా రాజశేఖర్‌ స్పందించారు. రాజశేఖర్‌ది చిన్న పిల్లల మనస్తత్వమన్నారు ఆయన సతీమణి జీవిత. ఎవరినీ కావాలని అగౌరవ పరిచే ఉద్దేశం రాజశేఖర్‌కు లేదని వివరణ ఇచ్చారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో ఉన్న గొడవలను పరిష్కరించుకుంటామన్నారు. ఏపని చేసినా కలిసికట్టుగా చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు జీవిత.

'మా' అభివృద్ధికి చిరంజీవి ఎన్నో సలహాలు ఇచ్చారని గొడవలు సద్దుమణిగేందుకు చాలా సమయం ఇచ్చారని వారి నుంచి ఎంతో నేర్చుకున్నామని ఆమె వెల్లడించారు. ఎక్కడైనా గొడవలు రావడం సహజమని ఆమె అన్నారు. మాను బలోపేతం చేయడం, గౌరవప్రదమైన సంస్థగా మార్చడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. నరేశ్‌తో తనకు కానీ, రాజశేఖర్‌కుకానీ వ్యక్తిగత విభేదాలు లేవని, చిన్నచిన్న భేదాభిప్రాయాలను అందరం కలిసి ఉమ్మడిగా పరిష్కరించుకుంటామని చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories