NTR,ANR తర్వాత ఆ స్థాయి చిరంజీవిదే : జీవిత

NTR,ANR తర్వాత ఆ స్థాయి చిరంజీవిదే  : జీవిత
x
Highlights

తలంబ్రాలు సినిమాతో నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు జీవిత.. ఆ తర్వాత అంకుశం, జానికిరాముడు,ఆహుతి, స్టేషన్‌ మాస్టర్ మొదలైన సినిమాలు ఆమెకి నటిగా...

తలంబ్రాలు సినిమాతో నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు జీవిత.. ఆ తర్వాత అంకుశం, జానికిరాముడు,ఆహుతి, స్టేషన్‌ మాస్టర్ మొదలైన సినిమాలు ఆమెకి నటిగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. సినిమా నటిగానే కాదు దర్శకురాలిగా కూడా జీవిత మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఆమె ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేసారు. గతంలో చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఇలా జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత రాజశేఖర్ నటించిన గరుడవేగా సినిమా విడుదల అయింది. ఈ సందర్బంగా సినిమాని చూడాలని చిరంజీవిని రాజశేఖర్ జీవిత కలిసిన అంశాన్ని కొందరు సోషల్ మీడియాలో వక్రికరిస్తూ ప్రచారం చేసారు.

అయితే దీనిపైన ఈ ఇంటర్వ్యూలో జీవిత స్పందిస్తూ..." కోన్ని సందర్భాల్లో కొందరు నచ్చుతారు, మరికొన్ని సందర్భాల్లో కొందరు నచ్చరు. అలాగని వారితో శత్రుత్వం ఉన్నట్టు కాదని స్పష్టతనిచ్చారు. చిరంజీవి మేము చాలా పార్టీలో, ఫంక్షన్ లో కలుసుకున్నాం ,మాట్లాడుకున్నాం. నాకు అయన గరుడవేగా సినిమా చూస్తే బాగుంటుందని అనిపించింది. అందుకే వెళ్లి అడిగాము. ఎన్టీఆర్, నాగేశ్వరరావు తర్వాత చిరంజీవినే హెడ్ అఫ్ ది ఫ్యామిలీ అని ఆ స్థాయి ఆయనదే అని , అందుకే వెళ్లి అడిగామని . అంతే కానీ ఇలా ఎందుకు రాస్తారో వారికే తెలియాలని జీవిత చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories